కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో.. పాత ప్రేయసిని చంపేసి.. అడవిలో శవాన్ని పాతేసి..!

Published : Aug 10, 2021, 10:31 AM ISTUpdated : Aug 10, 2021, 01:07 PM IST
కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో.. పాత ప్రేయసిని చంపేసి.. అడవిలో శవాన్ని పాతేసి..!

సారాంశం

పథకం ప్రకారం.. తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మాజీ ప్రేయసి ని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టారు.

ప్రేమించిన వాడే ఆమె పాలిట కాల యముడుగా మారాడు. ఆమెను అతి కిరాతకంగా చంపేసి.. శవాన్ని అడవిలో పాతేశాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన అనుజ్ కుమార్(22) అనే వ్యక్తి ఓ మహిళ(30) ను ప్రేమించాడు. ఆమెతో కలిసి సహజీవనం కూడా చేశాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే..   లాక్ డౌన్ లో సదరు మహిళ తన స్వగ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో.. అనుజ్ కుమార్ మరో యువతి ప్రేమలో పడిపోయాడు.  కొత్త గర్ల్  ఫ్రెండ్ తో కలిసి లివ్ ఇన్ రిలేషన్ లో ఉండటం మొదలుపెట్టాడు. అయితే.. అనుకోకుండా.. అతని మాజీ ప్రేయసి తిరిగి నగరానికి వచ్చేసింది. దీంతో.. మాజీ ప్రేయసిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.

పథకం ప్రకారం.. తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మాజీ ప్రేయసి ని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టారు. ఆ తర్వాత.. సదరు మహిళ కనిపించడం లేదని.. ఆమెను ఎవరో హత్య చేశారంటూ పోలీసులకు తప్పుడు సమాచారం అందించారు. విచారణలో వీరే నేరం చేసినట్లు తేలడంతో.. నిందితులు పోలీసులకు చిక్కారు.

  ఈ ఘనటలో ప్రధాన నిందితుడు అనుజ్ కుమార్ కాగా.. అతనికి సహకరించిన రంజాన్ ఖాన్(32), నౌషద్(21) లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించారని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !