ఇండియాలో తగ్గిన కరోనా:ఐదు నెలల కనిష్టానికి పడిపోయిన కోవిడ్ మరణాలు

Published : Aug 10, 2021, 10:22 AM IST
ఇండియాలో తగ్గిన కరోనా:ఐదు నెలల కనిష్టానికి పడిపోయిన కోవిడ్ మరణాలు

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజు 28,204 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 373 మంది మరణించారు. మార్చి నెలలో నాలుగు వందలలోపు కరోనా మరణాలు చోటు చేసుకొన్నాయి.

న్యూఢిల్లీ:  గత 24 గంటల్లో ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజే 28,204 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 15,11,313 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 28,204 మందికి కరోనా సోకినట్టుగా ఐసీఎంఆర్ తేల్చింది.గత 24 గంటల్లో  373 మంది కరోనాతో మరణించారు. అంతకు ముందు 400కి పైగా కరోనా మరణాలు చోటు చేసుకొన్నాయి.ఈ ఏడాది మార్చిలో  400లోపు కరోనా మరణాలు చోటు చేసుకొన్నాయి. ఆ తర్వాత నిన్న అంత తక్కువ స్థాయిలో కరోనా మరణాలు చోటు చేసుకొన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇండియాలో కరోనా కేసులు 3.19 కోట్లకు చేరుకొంది. కరోనాతో 4.28 లక్షల మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 3.88 లక్షలకు పడిపోయాయి. నిన్న ఒక్క రోజే  కరోనా నుండి 41,511 మంది కోలుకొన్నారు.ఇప్పటివరకు 3.11 కోట్ల మంది కరోనా నుండి కోలుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !
V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?