మహిళా జడ్జీకే వేధింపులు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్

Published : Mar 09, 2023, 02:39 PM IST
మహిళా జడ్జీకే వేధింపులు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్

సారాంశం

రాజస్తాన్‌లో ఓ దుండగుడు ఏకంగా మహిళా న్యాయమూర్తికే బెదిరింపులు చేశాడు. ఆమె ఫొటోలను సోషల్ మీడియా నుంచి డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి డెలివరీ చేశాడు. తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే.. ఆ ఫొటోలను పబ్లిక్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.  

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఓ వ్యక్తి ఏకంగా మహిళా జడ్జీకే బెదిరింపులు చేశాడు. ఆమె ఫొటోలను సోషల్ మీడియా నుంచి డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేశాడు. ఆ మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఆమెకు పంపించాడు. ఆమె కోర్టు చాంబర్‌కు, ఇంటికి కూడా డెలివరీ చేశాడు. ఆ ఫొటోలను పబ్లిక్ చేయకుండా ఉంచాలంటే తనకు రూ. 20 లక్షలు అందించాలని డిమాండ్ చేశాడు.

ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించారని పోలీసులు తెలిపారు. ఇంకా అరెస్టు చేయలేదని వివరించారు. ఫిబ్రవరి 28వ తేదీన కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

ఫిబ్రవరి 7వ తేదీన తన స్టెనోగ్రాఫర్‌కు ఓ వ్యక్తి వచ్చి పార్సిల్ డెలివరీ అందించాడని, అది స్కూల్‌లోని తన పిల్లల నుంచి వచ్చిందని చెప్పాడని జడ్జీ పోలీసులకు చేసిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. అతని పేరు ఏమిటని స్టెనోగ్రాఫర్ అడగ్గానే అక్కడి నుంచి ఆ నిందితుడు వెళ్లిపోయాడని వివరించారు. ఆ పార్సిల్‌లో కొన్ని స్వీట్లు ఉన్నాయని, ఆ జడ్జీకి చెందిన మార్ఫింగ్ చేసిన ఫొటోలూ ఉన్నాయని తెలిపారు. అలాగే, ఆ పార్సిల్ కవర్‌లో ఓ లెటర్ కూడా ఉన్నది. తనకు రూ. 20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని బెదిరింపు లేఖలు ఉన్నాయి.

Also Read: అమిత్ షాకు త్రిపురలో భద్రతా లోపం.. కాన్వాయ్‌లోకి చొచ్చుకొచ్చిన కారు.. సెక్యూరిటీ ఆపినా ఆగకుండా తప్పించుకుని..!

రూ. 20 లక్ష లతో రెడీగా ఉండాలని, లేదంటే ఆమెను, ఆమె కుటుంబాన్ని స్పాయిల్ చేస్తానని బెదిరించినట్టు ఆ లేఖ పేర్కొంది. సమయం, స్థలాన్ని త్వరలోనే చెబుతానని తెలిపింది.

ఇలాంటి వాటితోటే మరో పార్సిల్ వచ్చింది. ఇది 20 రోజుల తర్వాత ఆమె ఇంటికే వచ్చేసింది. అప్పుడు ఆ న్యాయమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోర్టు చాంబర్‌లో ఆమెకు డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు సీసీటీవీ కెమెరాలో 20 ఏళ్ల లోని వ్యక్తి కనిపించినట్టు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu