
ఢిల్లీ : హోలీనాడు ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని మద్యం మత్తులో కత్తులతో పొడిచి చంపేశారు. హోలీ వేడుకల్లో భాగంగా మద్యం సేవిస్తున్న కొందరితో ఆ వ్యక్తికి వాగ్వాదం జరిగింది. ఈ కారణంగా ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఇక్కడి బరౌత్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది.
విక్కీ, 22, మరికొందరు కలిసి కూర్చుని బుధవారం మద్యం సేవిస్తున్నప్పుడు వాగ్వాదం జరిగినట్లు సర్కిల్ ఆఫీసర్ బరౌత్ సావిరత్న గౌతమ్ తెలిపారు. అతను హిల్వాడి గ్రామ నివాసి. ఈ క్రమంలోనే అతని హత్య జరిగింది. దీని గురించిన సమాచారం అందడంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, హోలీ సందర్భంగా దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఘర్షణలో 32 ఏళ్ల వ్యక్తి మరణించాడు.మృతుడు బీహార్‌లోని ఖగ్రియాకు చెందిన బ్రజేష్ కుమార్‌గా గుర్తించారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడి తలపై గాయాల గుర్తులు ఉన్నాయి.
పోలీసుల విచారణలో బ్రిజేష్‌కు తెలిసిన సిద్ధార్థ్ అనే వ్యక్తి సమీపంలోని షాపులో షాంపూ కొనేందుకు వెళ్లి అక్కడున్న వ్యక్తితో గొడవ పడ్డాడు. సిద్దార్థ్ తిరిగి వచ్చేసిన తరువాత.. అతనితో గొడవ పడిన వ్యక్తి.. తన స్నేహితులు కొంతమందితో అతనిని అనుసరించాడు. ఆ తరువాత బ్రిజేష్జజ సిద్ధార్థ్‌తో గొడవకు దిగాడు.
ఈ గొడవలో దుండగులు బ్రిజేష్ తలపై ఇనుప రాడ్‌తో కొట్టారని పోలీసులు తెలిపారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.