మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి.. మహారాష్ట్ర మహిళకు కఠిన కారాగారశిక్ష...

Published : Jan 18, 2023, 02:14 PM IST
మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి.. మహారాష్ట్ర మహిళకు కఠిన కారాగారశిక్ష...

సారాంశం

థానే జిల్లాలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లోని తుర్భే ప్రాంతంలో ఉన్న ఓ మహిళ.. కొంతమంది మహిళలను మభ్యపెట్టి బలవంతంగా వ్యభిచారంలోకి దింపినందుకు గానూ ఆమెకు కోర్టు జైలుశిక్ష విధించింది.   

థానే : మహిళలను బలవంతంగా వ్యభిచార వ్యాపారంలోకి దింపిన 39 ఏళ్ల మహిళకు మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు నిన్న జారీ చేసిన ఉత్తర్వులో, ప్రత్యేక న్యాయమూర్తి వివి విర్కర్ మహిళల అక్రమ రవాణ (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితురాలిని దోషిగా ప్రకటిస్తూ, ఆమెకు రూ. 2,000 జరిమానా విధించారు.

థానే జిల్లాలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లోని తుర్భే ప్రాంతంలో ఆ మహిళ నివాసం ఉంటోంది. నిందితురాలు తుర్భేలోని తన నివాసాన్ని వ్యభిచారం కోసం ఉపయోగించుకుందని.. మహిళలు, మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెట్టిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేఖా హివ్రాలే కోర్టుకు తెలిపారు.

బీజేపీ వీఐపీ ఆకతాయిలు : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను తెరిచింది తేజస్వి సూర్యనే.. కాంగ్రెస్

మే 30, 2018న, నవీ ముంబై పోలీసుల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ బృందం ఆ ప్రాంగణంలో దాడి చేసింది. ఈ దాడిలో ఒక మహిళ బలవంతంగా ఫ్లెష్ ట్రేడ్ నిర్వహించడం వెలుగు చూసింది. ఆమె దగ్గర ఇరుక్కున్న మహిళలను రక్షించి నిందితురాలిని అరెస్టు చేశారు.

నిందితురాలిపై అభియోగాలను రుజువు చేసేందుకు 12 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించామని హివ్రాలే తెలిపారు. నిందితులపై అభియోగాలను ప్రాసిక్యూషన్ విజయవంతంగా రుజువు చేసిందని, దోషులుగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మరో మహిళను బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా వర్ణించారు. ఆమెను కోర్టు అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?