శ్రద్ధా వాకర్ కోసం కార్యక్రమం.. వ్యక్తిపై మహిళ చెప్పుతో దాడి.. ‘నా బిడ్డ అతని కొడుకుతో వెళ్లిపోయింది’

By Mahesh KFirst Published Nov 29, 2022, 5:34 PM IST
Highlights

శ్రద్ధా వాకర్ కేసులో న్యాయం జరగాలని ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో మహాపంచాయతీ నిర్వహించారు. ఈ కార్యక్రమం వేదికపై ఉన్న ఓ వ్యక్తిపైకి ఒక మహిళ చెప్పు విసిరేసింది. దీంతో ఆ కార్యక్రమమంతా కలకలం రేపింది.
 

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్యా ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శ్రద్ధా వాకర్ కేసులో న్యాయం జరగాలని దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో హిందూ ఏక్తా మంచ్‌పై మహాపంచాయతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. వేదిక పై ఉన్న ఓ వ్యక్తిపై చెప్పు విసిరేసింది.

వేదిక పై ఉన్న ఆ వ్యక్తి కుమారుడితో తన కూతురు వెళ్లిపోయింది. కానీ, తన కూతురికి ఇప్పటికీ పెళ్లి అయిందా? లేదా? అనే విషయం వారికి తెలియదు. ఇప్పటికీ కూతురి కోసం ఆ కుటుంబం క్షోభిస్తున్నది. అలాంటి తరుణంలో.. తన కూతురిని తీసుకెళ్లిన యువకుడి తండ్రి కనిపించడం, అదీ ప్రేమ పేరిట బయటకు తీసుకెళ్లి అమ్మాయిని కిరాతకంగా చంపేసిన శ్రద్ధా వాకర్ కోసం నిర్వహించిన వేదికపై కనిపించడంతో ఆమెకు పట్టలేని కోపం వచ్చింది. వేదిక పై ఉన్న ఆ వ్యక్తిపై స్లిప్పర్ విసిరేసింది.

Also Read: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. ఆఫ్తాబ్ పూనావాలాపై పాలిగ్రాఫ్ పాలీగ్రాఫ్ పరీక్ష పూర్తి.. డిసెంబర్ 1న నార్కో టెస్టు

పారిపోయిన ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. ఇండియా టుడే మీడియా సంస్థతో ఆ మహిళ మాట్లాడింది. ‘ఆ అబ్బాయి తల్లిని నేను తరుచూ తన కూతురితో కలిపించాలని అడిగాను. కానీ, ఆమెను డిస్టర్బ్ చేయవద్దని నన్ను బెదిరించింది. నా బిడ్డకు పెళ్లి అయిందా? లేదా? అని నాకు తెలియదు. నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను’ అని అన్నారు.

ఈ మహాపంచాయతీని శ్రద్ధా వాకర్‌ను హతమార్చిన ఏరియాలోనే నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి పారిపోయి ఢిల్లీకి వచ్చిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా, శ్రద్ధా వాకర్‌లు ఇదే ఏరియాలో అద్దెకు దిగారు. అక్కడే శ్రద్ధా వాకర్‌ను 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జీలో దాచి పెట్టాడు. ఆ తర్వాత ఆ ముక్కలను మెహరౌలీ అడవీ ప్రాంతాల్లో పలు చోట్ల పడేసి వచ్చాడు.  ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

click me!