లఖింపూర్ ఖేరీ హింస: సుప్రీం సీరియస్.. సుమోటోగా స్వీకరణ, రేపు విచారించనున్న సీజేఐ బెంచ్

Siva Kodati |  
Published : Oct 06, 2021, 10:31 PM ISTUpdated : Oct 06, 2021, 10:34 PM IST
లఖింపూర్ ఖేరీ హింస: సుప్రీం సీరియస్.. సుమోటోగా స్వీకరణ, రేపు విచారించనున్న సీజేఐ బెంచ్

సారాంశం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar pradesh) లఖింపుర్‌ ఖేరిలో (lakhimpur kheri) చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు (supreme Court) సీరియస్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar pradesh) లఖింపుర్‌ ఖేరిలో (lakhimpur kheri) చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు (supreme Court) సీరియస్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (justice nv ramana) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రేపు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును యూపీ పోలీసులు పట్టడంపై నిరసనలు వ్యక్తమవుతుండడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. 

మరోవైపు, ఈ కేసులో జోక్యం చేసుకొని సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ నిన్న యూపీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు శివకుమార్‌ త్రిపాఠి, (shiv kumar tripathi) సీఎస్‌ పాండా (cs panda) సీజేఐకి లేఖ రాసిన సంగతి విదితమే. ఇంతటి  హింసకు కారణమైన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విజ్ఞప్తి చేయడంతో పాటు నిందితులకు శిక్షపడేలా కేంద్ర హోంశాఖను (union home ministry) ఆదేశించాలని కోరారు. న్యాయవాదుల లేఖను పరిణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు...  ఘటనను సుమోటోగా తీసుకుని విచారణకు స్వీకరించింది.   

Also Read:Lakhimpur Kheri: లక్నో ఎయిర్‌పోర్టులో రాహుల్ నిరసన, ప్రియాంక విడుదల

కాగా, నరేంద్ర మోడీ (narendra modi) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను (farm Laws) రద్దు చేయాలని కోరుతూ ఆదివారం యూపీలోని లఖింపుర్‌ ఖేరిలో రైతులు టికోనియా-బన్బీపుర్‌ రహదారిపై రైతులు ఆందోళన చేస్తుండగా.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్ర (ajay mishra) తనయుడు ఆశిష్‌ మిశ్రా (ashish misra) కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించారు. తమ సహచరుల మరణంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వెనుక వస్తున్న కారును ధ్వంసం చేసి అందులో ప్రయాణిస్తున్న నలుగురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి తనయుడు సహా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో యూపీ ప్రభుత్వం (up govt) దర్యాప్తు నిమిత్తం సిట్‌ను (sit) ఏర్పాటు చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం