రెండేళ్ల క్రితం భర్త మృతి: అతడి వీర్యంతో పండంటి బిడ్డకు జన్మ, ఎలాగంటే?

By narsimha lode  |  First Published Dec 17, 2023, 9:33 AM IST

భర్త మరణించిన తర్వాత  ఓ మహిళ  పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.తల్లీ,బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 


కోల్‌కత్తా: మరణించిన భర్త వీర్యంతో  ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్ భూమ్ జిల్లాలోని మురారై ప్రాంతంలో చోటు చేసుకుంది. ఐవీఎఫ్ పద్దతిలో ఈ ప్రక్రియ జరిగింది.  తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. 

బెంగాల్ రాష్ట్రంలోని  భీర్‌భూమ్ జిల్లాలోని  మురారై ప్రాంతంలో  సంగీ, అరుణ్ ప్రసాద్ లు దంపతులు. దాదాపు  27 ఏళ్ల క్రితం వీరిద్దరికి వివాహమైంది. సంగీతకు  గర్భ సంబంధమైన సమస్యలున్నాయి. దీంతో వీరికి సంతానం కలగలేదు.ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు  అరుణ్ ప్రసాద్  తన వీర్యాన్ని రెండేళ్ల క్రితం  ల్యాబ్ లో భద్రపర్చారు.  

Latest Videos

undefined

అరుణ్ ప్రసాద్ కు  కరోనా సోకింది. కరోనా కారణంగా అరుణ్ ప్రసాద్  మృతి చెందాడు. అరుణ్ ప్రసాద్ మృతితో  సంగీత బతుకు దుర్భరంగా మారింది.  అరుణ్ ప్రసాద్ నడిపిన  వాణిజ్య దుకాణమే  ఆమెకు ఆధారమైంది. భర్త మరణించిన తర్వాత ముదిమి వయస్సులో తనకు పిల్లలు కావాలని  భావించింది.  ఈ విషయమై ఆమె  వైద్యులను  సంప్రదించింది. ఐవీఎఫ్ పద్దతి ద్వారా బిడ్డన కనాలని ఆమె నిర్ణయం తీసుకుంది.  కోల్‌కత్తాలోని ల్యాబ్ లో భద్రపర్చిన  వీర్యాన్ని వైద్యులు  ఆమె అండంలో ప్రవేశ పెట్టారు. దీంతో సంగీత గర్భం దాల్చింది.  ఈ నెల  12న సంగీత  మగబిడ్డకు జన్మనిచ్చింది.

కోల్‌కత్తా రాష్ట్రంలోని  బీర్‌భూమ్ జిల్లాలో  సంగీత అనే మహిళ  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.  భర్త చనిపోయిన రెండేళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. సంగీత భర్త  అరుణ్ ప్రసాద్ తన వీర్యాన్ని ఓ ల్యాబ్ లో భద్రపరిచాడు.ఈ వీర్యాన్ని ఐవీఎఫ్ పద్దతిలో  సంగీత గర్భంలో ప్రవేశ పెట్టారు. దరిమిలా సంగీత  గర్భం దాల్చింది.డిసెంబర్  12న  సంగీత మగబిడ్డకు జన్మనిచ్చింది.

 


 

click me!