భారత ఆర్మీ క్యాంప్ లో అగ్నిప్రమాదం... తప్పిన పెనుప్రమాదం

Published : Dec 17, 2023, 08:53 AM ISTUpdated : Dec 17, 2023, 09:03 AM IST
భారత ఆర్మీ క్యాంప్ లో అగ్నిప్రమాదం... తప్పిన పెనుప్రమాదం

సారాంశం

శ్రీనగర్ శివారులోని ఐటిబిపి ( indo tibental Border Police Force )  క్యాంప్ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

శ్రీనగర్ : భారత ఆర్మీ క్యాంప్  లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జమ్ముూ కాశ్మీర్ లోని శ్రీనగర్ పట్టణ సరిహద్దుల్లోని ఐటిబిపి ( ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ) క్యాంప్ లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే వెంటనే క్యాంపులోని జవాన్లు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని ఆర్మీ ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు. 
 
ఐటిబిపి క్యాంప్ లోని ఓ షెడ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కొన్ని వస్తువులు, బట్టలు కలిగిన ఓ షెడ్ మొత్తం మంటల్లో దహనమయ్యిందని అధికారులు తెలిపారు.  వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది. ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు మంటలను అదుపుచేయడంలో ఫైర్ సిబ్బందికి సహకరించారు. 

భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపుచేయడానికి ఫైర్  సిబ్బందికి కష్టతరంగా మారింది. కానీ ఎలాగోలా మంటలనయితే అదుపులోకి తేగలిగారు. ఈ అగ్నిప్రమాదంలో కొంత ఆస్తినష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఉన్నతాధికారులు ఊపీరి పీల్చుకున్నాారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్