ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి, హత్యా, ఆత్మహత్యా..?

Published : Nov 13, 2018, 12:03 PM IST
ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి, హత్యా, ఆత్మహత్యా..?

సారాంశం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. 

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. బెంగళూరులోని విద్యరాన్యాపుర ప్రాంతంలోని ఒక ఇంట్లో సుధారాణి(29) అనే మహిళ ఆమె కుమార్తె సోనికా(6), తల్లిదండ్రులు జనార్థన్(52), సుమిత్ర(45) మృత్యువాతపడ్డారు.

వారి ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టి చూడగా.. వారు చనిపోయి కనిపించారు. జనార్థన్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. దాదాపు ఏడేళ్ల క్రితం కుమార్తె సుధారాణికి అర్జున్ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. అర్జున్.. మెడికల్ షాప్ నిర్వహిస్తుంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

కాగా.. వారి మృతదేహాల వద్ద ఓ సూసైడ్ నోట్ కూడా కనపడింది. ఆ సూసైడ్ నోట్ లో ‘‘ కొత్త ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తికి రూ.25లక్షలు ఇచ్చాను. అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నా డబ్బులు అంతా పోయాయి’’ అంటూ సుధారాణి రాసినట్లు ఉంది.

వీరి మృతిపై సుధారాణి భర్త అర్జున్ ని పోలీసులు ఆరా తీయగా.. తన భార్య పుట్టింటి కి వెళతాను అని చెప్పి పాపను తీసుకొని వెళ్లిందని.. ఇప్పుడు ఇలా వారి చావు వార్త విన్నానని ఆయన బోరున విలపించాడు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే