హోంవర్క్ చేయలేదని కొట్టిన టీచర్.... పక్షవాతంతో కుప్పకూలిన చిన్నారి

By sivanagaprasad kodatiFirst Published Nov 13, 2018, 11:37 AM IST
Highlights

మహారాష్ట్రలో విద్యార్థి పట్ల టీచర్ అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. హంవర్క్ చేయలేదన్న కారణంగా బలంగా కొట్టడంతో చిన్నారి విద్యార్థి పక్షవాతానికి గురయ్యాడు. 

మహారాష్ట్రలో విద్యార్థి పట్ల టీచర్ అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. హంవర్క్ చేయలేదన్న కారణంగా బలంగా కొట్టడంతో చిన్నారి విద్యార్థి పక్షవాతానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పుణె జిల్లా ఇందాపూర్ ప్రాంతానికి చెందిన ఓ దంపతులు తమ ఇద్దరు కుమారులను శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ప్రిపరేటరీ మిలటరీ స్కూల్ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు.

ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేందుకు వారు హాస్టల్‌కు వచ్చారు. ఆ సమయంలో తమ చిన్న కుమారుడి ముఖం కమిలిపోవడంతో పాటు ఉబ్బి కనిపించింది. దీంతో వారు ఏం జరిగిందా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆరో తరగతి చదువుతున్న వీరి చిన్న కుమారుడు.. గత నెలలో ఇచ్చిన డ్రాయింగ్ అసైన్‌మెంట్ పూర్తి చేయకపోవడంతో సంబంధిత టీచర్ ఆ చిన్నారిని తీవ్రంగా కొట్టారు. చెంపపై బలంగా కొట్టడమే కాక.. తలని బెంచికేసి బాదినట్లు చిన్నారి తల్లిదండ్రులకు చెప్పాడు.

టీచర్ కొడతాడేమోనని భయపడి ప్రిన్సిపాల్‌కు కూడా చెప్పలేదని ఆ చిన్నారి తన తల్లిదండ్రుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.. దీంతో వారు వెంటనే బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లారు..

ముఖానికి బలంగా దెబ్బలు తగలడంతో చిన్నారి ముఖానికి పక్షవాతం వచ్చిందని వైద్యుతు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీనిపై సమాచారం అందుకున్న పాఠశాల ప్రిన్సిపాల్.. డ్రాయింగ్ టీచర్‌ను సస్పెండ్ చేశారు. 

click me!
Last Updated Nov 13, 2018, 11:37 AM IST
click me!