ఆ బీజేపీ ఎమ్మెల్యే నా బిడ్డకు తండ్రి.. మహిళ సంచలన ఆరోపణ

Published : Aug 18, 2020, 09:52 AM IST
ఆ బీజేపీ ఎమ్మెల్యే నా బిడ్డకు తండ్రి.. మహిళ సంచలన ఆరోపణ

సారాంశం

డెహ్రాడూన్ లోని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ అధికారులు ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తామని లా అండ్ ఆర్డర్ డీజీ అశోక్ కుమార్ తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే తనపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారని.. దాని వల్ల తాను ఓ బిడ్డకు తల్లి అయ్యానంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ మహిళ తనను రూ.5కోట్లు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఇటీవల ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి భార్య ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. డెహ్రాడూన్ లోని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ అధికారులు ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తామని లా అండ్ ఆర్డర్ డీజీ అశోక్ కుమార్ తెలిపారు.

కాగా, ఎమ్మెల్యే మహేష్ నేగి భార్య ఫిర్యాదుపై ఆ మహిళ స్పందించారు. ఆ ఎమ్మెల్యే తనపై గత రెండేండ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఎమ్మెల్యే కారణంగా తాను ఆడపిల్లకు జన్మనిచ్చానని ఆమె పేర్కొన్నారు. కావాలంటే.. డీఎన్ఏ పరీక్ష కు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఎమ్మెల్యే డీఎన్ఏ తో తన బిడ్డ డీఎన్ఏ ను పరీక్షించాలని కోరారు. ఎమ్మెల్యే భార్య కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని... తాను ఎలాంటి డబ్బు డిమాండ్ చేయలేదని ఆమె పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM