ప్రముఖ సంగీత విద్వాంసుడు జస్రాజ్ కన్నుమూత

Published : Aug 18, 2020, 06:39 AM IST
ప్రముఖ సంగీత విద్వాంసుడు జస్రాజ్ కన్నుమూత

సారాంశం

ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు 90 ఏళ్లు. పండిట్ జస్రాజ్ కన్నుమూసిన విషయాన్ని ఆయన కూతురు ధ్రువీకరించారు. ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు.

న్యూఢిల్లీ: ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ (90) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన తుది శ్వాస విడిచారు. కూతురు దుర్గా జస్రాజ్ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. 1930 జనవరి 28వ తేదీిన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో జస్రాజ్ జన్మించారు. 

దాదాపు 80 ఏళ్ల పాటు గాయకుడిగా, సంగీత గురువుగా శాస్త్రీయ సంగీతాన్నికి ఆయన ఎనలేని సేవలందించారు. ఆయనకు సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందాయి. ప్రముఖ సంగీత కళాకారాలులు సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామనాథ్, బాలీవుడ్ గాయని సాధనా సర్గమ్ ఆయన శిష్యులే. 

జస్రాజ్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. జస్రాజ్ మృతి తనను ఎంతగానో బాధించిందని రాష్ట్రపతి అన్నారు. జస్రాజ్ మృతి భారత సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జస్రాజ్ తో కలిసి ఉన్న ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు