నాలుగో అంతస్తునుండి పడి మహిళ మృతి.. భుజాలపై మోసుకెళ్లి..

By AN TeluguFirst Published Mar 15, 2021, 10:21 AM IST
Highlights

ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి పడి  శనివారం తెల్లవారుజామున 22 ఏళ్ల మహిళ మరణించింది. పడిన వెంటనే ఆమె మృతదేహాన్ని ఓ వ్యక్తి భుజాల మీద ఎత్తుకెడుతున్న దృశ్యాలు ఎదురు బిల్డింగ్ లోని సిసి కెమెరాలో చిక్కాయి. ఆ వ్యక్తిని,  అతనికి సహాయం చేసిన మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి పడి  శనివారం తెల్లవారుజామున 22 ఏళ్ల మహిళ మరణించింది. పడిన వెంటనే ఆమె మృతదేహాన్ని ఓ వ్యక్తి భుజాల మీద ఎత్తుకెడుతున్న దృశ్యాలు ఎదురు బిల్డింగ్ లోని సిసి కెమెరాలో చిక్కాయి. ఆ వ్యక్తిని,  అతనికి సహాయం చేసిన మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలోని షకుర్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి మహిళ పడిపోగా,  కొద్దిసేపటి తరువాత, ఓ వ్యక్తి అదే భవనం నుండి బయటకు రావడం, స్త్రీని భుజంపైకి ఎత్తుకుని పారిపోవడం సీసీ కెమెరాలో నమోదయ్యింది. ఇతన్ని 35 ఏళ్ల ముఖేష్ కుమార్ గా గుర్తించారు. అతన్ని లక్నో-ఆగ్రా హైవే దగ్గర అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆ మహిళను చెత్త డంపింగ్ యార్డ్ దగ్గర్లో పడేశారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి,  చికిత్స అందించారు. అయితే చికిత్స తీసుకుంటూ ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారు.

22 ఏళ్ల మృతురాలు జార్ఖండ్ నివాసి. కొద్ది రోజుల క్రితం పని కోసం ఢిల్లీకి వచ్చింది. ఈ క్రమంలో ప్లేస్‌మెంట్ ఏజెన్సీని నడుపుతున్న ముఖేష్‌ను ఆమె కలిసింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, ముఖేష్ మెయిడ్స్, హౌజ్ హెల్ప్స్ సప్లయ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. బాధితురాలు పనికోసం ముఖేష్ ను కలిసింది. అయితే వీరిద్దరి మధ్య పేమెంట్ విషయంలో జరిగిన గొడవ ఘటనకు దారి తీసిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) ఉషా రంగ్నాని వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

సిసిటివి ఫుటేజీని పరిశీలించినప్పుడు నాల్గో అంతస్తు నుండి మహిళ పడిపోగానే, ప్రధాన నిందితుడు ముఖేష్ ఆమెను తన భుజాలపై ఎత్తుకుని దగ్గర్లోని చెత్త డంపింగ్ దగ్గర వదిలేశాడని, ఆ తర్వాత, అతను, అతని కుటుంబం, స్నేహితుడు  కలిసి కారులో అక్కడినుండి పారిపోయారు, రక్తపు మరకల్ని ఇసుకతో కప్పేశారని పోలీసు అధికారి తెలిపారు.

దీంతో వీరి మీద హత్య కేసు నమోదుచేశామని టెక్నికల్ సర్వైలెన్స్ అండ్ లోకల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, ముఖేష్, అతని సహచరుడు జిటెన్ లు బీహార్లోని దర్భంగా జిల్లాలోని మాజీ స్థానిక మీర్జాపూర్ గ్రామానికి వెళుతున్నట్లు తెలిసిందని తెలిపారు.
 

click me!