బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు... ముగ్గురు మృతి, మరొకరు విషమం

By Arun Kumar PFirst Published Mar 15, 2021, 9:35 AM IST
Highlights

విరుదనగర్ సమీపంలోని శివకాశి రోడ్డులోని బాణాసంచా తయారీ కర్మాగారంలో ప్రమాదం జరిగింది.   
 

చెన్నై: బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించి ముగ్గురు కార్మికులు మృతిచెందిన విషాదం తమిళనాడులో చోటుచేసుకుంది. విరుదనగర్ సమీపంలోని శివకాశి రోడ్డులోని బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది.   

విరుదనగర్ లోని గురుమూర్తినగర్ లో విశాకన్ అనే వ్యక్తి బాణాసంచా కర్మాగారాన్ని నడిపిస్తున్నాడు. అయితే శనివారం సాయంత్రం కార్మికులు టపాసులు తయారుచేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు వీరాస్వామి (55), పంచవర్ణం (51), రాజా (40), నట రాజన్‌ (50)కు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు వీరిని కాపాడి హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడ్డ వీరిలో  వీరాస్వామి, రాజా, నటరాజన్‌ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. పంచవర్ణం పరిస్థతి కూడా విషయంగా ఉందని వైద్యులు తెలుస్తోంది.  

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇతర కార్మికులు, యాజమాన్యాన్ని విచారించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదకరమైన బాణాసంచా కర్మాగారంలో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. 

click me!