మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 16,620 కేసులు..

By AN TeluguFirst Published Mar 15, 2021, 9:49 AM IST
Highlights

మహారాష్ట్రలో ఈ ఏడాది అత్యధికంగా ఒక్క రోజులో 16,620 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు సంఖ్య 23,14,413 కు చేరుకుంది. ఒక్కరోజే 50 మంది మరణించడంతో... మృతుల సంఖ్య 52,861 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో ఈ ఏడాది అత్యధికంగా ఒక్క రోజులో 16,620 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు సంఖ్య 23,14,413 కు చేరుకుంది. ఒక్కరోజే 50 మంది మరణించడంతో... మృతుల సంఖ్య 52,861 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా,  గత రెండు రోజుల్లో రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 15,000 పైగానే నమోదవుతూ ఉంది. ఆదివారం ఈ సంఖ్య 16,000 మార్కును దాటింది. ఆదివారం నాడు 8,861 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 21,34,072 కు పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో కరోనా రికవరీ రేటు 92.21 శాతం ఉండగా,  మరణాల రేటు 2.28 శాతంగా ఉంది.  రాష్ట్రంలో ప్రస్తుతం 1,26,231 క్రియాశీల కేసులు ఉన్నాయని కూడా ఆ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

వీరిలో 5,83,713 మంది హోం క్వారంటైన్ లో ఉండగా, 5,493 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఆదివారంనాడు 1,08,381 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు చేసిన పరీక్షల మొత్తం సంఖ్య 1,75,16,885 కు చేరింది.

ముంబై లో కొత్తగా 1,963 కేసులు నమోదు కాగా, పూణేలో 1,780, ఔరంగాబాద్ 752, నాందేడ్  351, పింప్రి చిన్చ్వాడ్ 806, అమరావతి 209, నాగ్‌పూర్ 1,976 కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు, అహ్మద్‌నగర్ లో 151, జల్గావ్ 246, నాసిక్ 946 కేసులు నమోదయ్యాయి.

ముంబై డివిజన్‌లో 3,676, నాసిక్ డివిజన్లో 2,776, పూణే డివిజన్లో 3,609, నాగ్‌పూర్ డివిజన్లో 1,860, లాతూర్ డివిజన్ లో 914, ఔరంగాబాద్ డివిజన్ లో 1,289, కొల్లాపూర్ డివిజన్ లో106 కేసులు నమోదయ్యాయి.

ముంబై డివిజన్ లో థానే, కళ్యాణ్ డొంబివాలి, ఉల్హాస్ నగర్, భివాండి, మీరా భయాందర్, పాల్ఘర్, వాసాయి-విరార్, రాయ్గడ్, పన్వెల్ లో గడిచిన 24 గంటల్లో కరోనా తో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.

పగటిపూట నమోదైన 50 మరణాలలో 11 మంది ముంబై డివిజన్‌లో ఉన్నారు, ఇందులో ముంబై నగరంలో ఏడు, థానే జిల్లాలో రెండు, నవీ ముంబైలో నమోదయ్యాయి. 

మహారాష్ట్రలో కరోనావైరస్ గణాంకాలు ఈ  విధంగా ఉన్నాయి : 
పాజిటివ్ కేసులు 23,14,413
మరణాల సంఖ్య 52,861
కోలుకున్నవారు  21,34,072 
క్రియాశీల కేసులు 1,26,231 
మొత్తం పరీక్షలు 1,75,16,885
ఆదివారం జరిగిన పరీక్షలు 1,08,381 

click me!