విషాదం: భర్త అంత్యక్రియలు పూర్తైన కొద్దిసేపటికే భార్య ఆత్మహత్య

Published : May 23, 2021, 03:13 PM IST
విషాదం: భర్త అంత్యక్రియలు పూర్తైన కొద్దిసేపటికే భార్య ఆత్మహత్య

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మనహళ్లిలో విషాదం చోటు చేసుకొంది. భర్త చనిపోయిన కొద్దిసేపటి  తర్వాతే భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 

మండ్య:కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మనహళ్లిలో విషాదం చోటు చేసుకొంది. భర్త చనిపోయిన కొద్దిసేపటి  తర్వాతే భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మండ్యా జిల్లాలోని నాగమంగళ తాలుకా పరిధిలో గల బొమ్మనహళ్లిలో కిరణ్, పూజలు నివాసం ఉంటున్నారు. 11 నెలల క్రితం  కిరణ్, పూజలు వివాహం చేసుకొన్నారు. బొమ్మనహళ్లిలో  నివాసం ఉంటున్నారు. 

కరోనా కారణంగా కిరణ్  గుండెజబ్బుతో శనివారం నాడు ఉదయం మరణించాడు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  కిరణ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. కిరణ్ అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తర్వాత పూజ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గంటల వ్యవధిలోభార్యాభర్తలు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.పూజ మృతదేహానికి వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. భర్త మరణించిన తర్వాత పూజ షాక్‌కు గురైందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికుల్లో విషాదాన్ని నింపింది. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !