యాస్ తుఫాన్‌: ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష

By narsimha lodeFirst Published May 23, 2021, 1:32 PM IST
Highlights

యాస్ తుఫాన్ నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడుసమావేశమయ్యారు. 

న్యూఢిల్లీ: అదిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి ప్రజలను సురక్షితంగా తరలించేలా రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని మోడీ అధికారులకు సూచించారు. యాస్ తుఫాన్ నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడుసమావేశమయ్యారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్  అధికారులతో పాటు,విద్యుత్, టెలికం, సివిల్ సప్లయిస్ , ఎర్త్ సైన్సెస్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు హెలికాప్టర్లు, ఓడలను  తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిద్దంగా ఉంచారు. విద్యుత్, టెలిఫోన్   నెట్‌వర్క్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ కోరారు. ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకోవాలని కూడ ఆయన సూచించారు.   

ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 46 బృందాలు ఇప్పటికే  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మరో 13 బృందాలను ఆయా ప్రాంతాలను తరలించనున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిస్థితిని సమీక్షిస్తోంది.తుఫాన్ విరుచుకుపడే రాష్ట్రాలతో హోంమంత్రిత్వశాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్రాలకు సహాయం చేయనుంది. తుఫాన్ నుండి ప్రజలను ఎదుర్కొనే విషయంలో అవగాహన కల్పించనుంది. 

ఈ ఏడాది మే 26న రాష్ట్రాన్ని యాస్ తుఫాన్ బెంగాల్ రాష్ట్రాన్ని తాకనుంది. తుఫాన్ తో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు గాను అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.  తుఫాన్ ప్రభావిత ప్రాంతాలన అలెర్ట్ చేసేందుకు గాను  బెంగాల్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ లో అధికారులు నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సాగించేందుకు గాను   అధికారులను అప్రమత్తం చేశారు. అంతేకాదు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు అదనంగా అధికారులను తరలించారు. 

తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల్లో  ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలెర్ట్ చేశారు.  బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ  తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని  అధికారులు అంచనా వేస్తున్నారు. ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల అధికారులు ఇప్పటికే తుఫాన్ పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌతంబా శనివారం నాడు ఉన్నతాధికారులతో యాస్ తుఫాన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖాధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. టౌటే తుఫాన్ ఇప్పటికే  పశ్చిమ తీరాన్ని తీవ్రంగా నష్టపర్చింది. యాస్ తుఫాన్ దేశంలోని తూర్పు ప్రాంతంపై ప్రభావం చూపనుంది. యాస్ అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ప్రకటించారు. 

click me!