నలుగురిని లవ్ చేసి.. లక్కీ డ్రాలో ఒకరిని సెలక్ట్ చేసుకొని..

Published : Mar 06, 2021, 09:15 AM ISTUpdated : Mar 06, 2021, 09:18 AM IST
నలుగురిని లవ్ చేసి.. లక్కీ డ్రాలో ఒకరిని సెలక్ట్ చేసుకొని..

సారాంశం

నలుగురి పేర్లు చీటీ రాసి డ్రా తీయగా.. ఎవరి పేరు వస్తే వారితో యువతి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓ యువతి ఒకేసారి నలుగురిని ప్రేమించింది. ఆ నలుగురితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కాగా... యువతి కోసం కుటుంబసభ్యులు గాలించగా.. ఆచూకీ దొరికింది. ఆ నలుగురితో కలిసి యువతి ని పట్టుకొని ఇంటికి తీసుకువచ్చారు. కాగా.. తర్వాత.. ఆ నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని కుటుంబసభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో.. ఎవరిని ఎంచుకోవాలో యువతికి అర్థం కాలేదు.

దీంతో.. నలుగురి పేర్లు చీటీ రాసి డ్రా తీయగా.. ఎవరి పేరు వస్తే వారితో యువతి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అంబేడ్కర్ నగర్ లోని అజిమ్ నగర్ కు చెందిన యువతి ఇటీవల నలుగురు యువకులతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వీరంతా బంధువుల ఇల్లల్లో తలదాచుకున్నారు. ఈ విషయం తెలిసుకున్న యువతి కుటుంబస్యులు వారిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.

ఈ విషయంలో పంచాయతీ జోక్యం చేసుకొని కేసు పరిష్కరించడం గమనార్హం. నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావనే ప్రశ్నకు యువతి బాగా తికమకపడిపోయింది. దీంతో పంచాయతీ పెద్దలు చిటీలు వేసి వరుడిని ఎంపిక చేశారు. నలుగురి పేర్లు రాసి ఓ చిన్నారితో డ్రా తీయించారు. చిన్నారి తీసిన చీటిలో పేరున్న యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !