ఘోరం.. నిర్బంధించి నెల రోజులు యువతిపై 60మంది అత్యాచారం

Published : Mar 06, 2021, 08:09 AM ISTUpdated : Mar 06, 2021, 08:39 AM IST
ఘోరం..  నిర్బంధించి నెల రోజులు యువతిపై 60మంది అత్యాచారం

సారాంశం

మూతపడిన గ్యారేజ్ లో తనను ఇన్ని రోజులు బంధించారని ఆమె చెప్పింది. గురువారం బహిర్భూమికి వెళ్లాలని చెప్పి వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఝార్ఖండ్ లో ఘోరాతి హోరం చోటుచేసుకుంది. ఓ యువతిపై దాదాపు 60మంది అత్యాచారానికి పాల్పడ్డారు.  యువతిని అపహరించి.. నెల రోజులపాటు బంధించి 60మంది దుండగులు అత్యాచారం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని.. మాట వినకపోతే కొట్టి హింసించేవారని చెప్పింది. సరాయ్ కేలా- ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీసంలో మూతపడిన గ్యారేజ్ లో తనను ఇన్ని రోజులు బంధించారని ఆమె చెప్పింది. గురువారం బహిర్భూమికి వెళ్లాలని చెప్పి వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలు అనారోగ్యంతో ఉందని.. సరిగా మాట్లాడలేకపోతోందని పోలీసులు చెప్పారు. కనీసం తనను ఎప్పుడు ఎలా కిడ్నాప్ చేశారో కూడా సరిగా చెప్పలేకపోతోందని వారు అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్