దారుణం: కుక్కకు క్షమాపణ చెప్పకపోవడంతో ఓ వ్యక్తి హత్య

Published : Oct 08, 2018, 10:40 AM IST
దారుణం: కుక్కకు క్షమాపణ చెప్పకపోవడంతో ఓ వ్యక్తి హత్య

సారాంశం

తమ కుక్కకు  క్షమాపణ చెప్పనందుకు  ఓ వ్యక్తిని  దారుణంగా  పొడిచి చంపిన ఘటన ఢిల్లీలో  చోటు చేసుకొంది.   ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకొంది.

న్యూఢిల్లీ: తమ కుక్కకు  క్షమాపణ చెప్పనందుకు  ఓ వ్యక్తిని  దారుణంగా  పొడిచి చంపిన ఘటన ఢిల్లీలో  చోటు చేసుకొంది.   ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకొంది.

న్యూఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో అంకిత్, పరాస్, దేవ్ చోప్రా అనే ముగ్గురు  ఆదివారం సాయంత్రం తమ పెంపుడు కుక్కతో కలిసి వాహ్యాళికి వచ్చారు.  అయితే వీరికి పొరుగున ఉండే విజేందర్‌రాజు అనే ట్రక్కు డ్రైవర్  అతి వేగంగా తన వాహనంతో  అటుగా వెళ్లాడు.  అయితే  దీంతో ఆ వేగానికి  భయపడిన కుక్క ట్రక్కును చూసి మొరిగింది.

దీంతో కుక్కకు భయపెట్టిన  ట్రక్కు డ్రైవర్‌ను ఈ ముగ్గురు డిమాండ్ చేశారు. అంతేకాదు  ఠాణాకు వెళ్లి ముగ్గురు కుక్కకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  అయితే  అందుకు  డ్రైవర్ నిరాకరించాడు.

దీంతో  ఆగ్రహించిన ఈ ముగ్గురు  స్క్రూడ్రైవర్లు, కత్తులతో  విచక్షణ రహితంగా పొడిచారు. ఈ విషయం తెలుసుకొన్న డ్రైవర్ సోదరుడు   రాజేష్ ను కూడ పొడిచారు. దీంతో ట్రక్కు డ్రైవర్  అక్కడికక్కడే మరణించాడు.రాజేష్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?