Covi-19 Treatment : 158 రోజుల తరువాత కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన మహిళ..

By SumaBala BukkaFirst Published Dec 9, 2021, 9:18 AM IST
Highlights

వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం ఇదే అత్యంత సుదీర్ఘకాలమని, బహుశా రాష్ట్రంలోనే ఎక్కువ కాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వ్యక్తి ఆమేనని Koppal Districtలోని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.

కొప్పల్ : కర్ణాటకలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. కొప్పల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో చికిత్స పొందుతున్న ఓ మహిళా covid-19 రోగి 158 రోజుల తరువాత సోమవారం Discharge అయ్యారు. దాదాపు ఐదు నెలలకు పైగా corona infectionsకు చికిత్స తీసుకుని ఆమె డిశ్చార్జ్ అయ్యారు. 

వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం ఇదే అత్యంత సుదీర్ఘకాలమని, బహుశా రాష్ట్రంలోనే ఎక్కువ కాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వ్యక్తి ఆమేనని Koppal Districtలోని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.

కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సెకండ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఓ 43 ఏళ్ల మహిళ కరోనా వైరస్ బారిన పడింది. దీంతో జూలై 3న ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిందని కిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాల కె తెలిపారు. ఆమెకు 104 రోజుల పాటు Ventilator support అవసరం పడిందని చెప్పారు.

"తరువాత, ఆమె ఎనిమిది రోజుల పాటు high flow nasal cannula [మెడికల్ ఆక్సిజన్]మీద ఉంది" అని డాక్టర్ వేణుగోపాల చెప్పారు. "ఆమెకు నిమిషానికి 15-20 లీటర్ల ఆక్సిజన్ అవసరం పడిందని" ఆయన చెప్పుకొచ్చారు.  ఆమె ఊపిరితిత్తులు 93% దెబ్బతిన్నాయని, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడిందని KIMS వర్గాలు తెలిపాయి.

“ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున, ఆమెను మొదటి నుండి ICU లోనే ఉంచారు. ఆమె కేసు మా వైద్యుల బృందానికి పెద్ద సవాలుగా మారిందని ”సిబ్బంది చెప్పారు. ఎట్టకేలకు సోమవారం ఆమె డిశ్చార్జ్ కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. 

Army Helicopter Crash : హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకేఒక్కడు ఈయనే...

కాగా, దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారంనాటి లెక్కల ప్రకారం.. గ‌డిచిన 24 గంటల్లో 8439 కొత్త క‌రోనా కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వ అధికార వ‌ర్గాలు తెలిపాయి. 195 మంది చ‌నిపోయార‌ని పేర్కొంది. 9525 మంది కోలుకున్నార‌ని తెలిపింది. చాలా రోజులుగా నెమ్మ‌దిగా సాగిన క‌రోనా పాజిటివిటీ రేటు.. ఇప్పుడిప్పుడే వేగంగా పెరుగుతోంది. 

మంగళవారం వ‌చ్చిన కేసులు కంటే బుధవారం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన కేసుల వివ‌రాల‌ను బ‌ట్టి చూస్తే 23 శాతం పెరిగింద‌ని తెలుస్తోంది. అయితే ఇందులో దాదాపుగా బ‌య‌ట‌ప‌డేవి డెల్టా వేరియంట్ కేసులే కావ‌డం కొంత ఉప‌శమ‌నం క‌ల్గించే అంశం. భార‌తదేశంలో క‌రోనా కేసులు మొట్ట మొద‌టి సారిగా కేర‌ళ‌లోనే భ‌య‌ట‌ప‌డ్డాయి. మొద‌టి వేవ్‌లో క‌రోనాను అడ్డుకోవ‌డానికి కేర‌ళ ప్ర‌భుత్వం తీవ్రంగా శ్ర‌మించింది. అక్క‌డ ప్ర‌భుత్వ వైద్య వ్య‌వ‌స్థ కింది స్థాయి వ‌ర‌కు ప‌టిష్టంగా ఉండ‌టం వ‌ల్ల క‌రోనాను తొంద‌ర‌గానే అదుపులోకి తీసుకొచ్చింది. 

గ‌తం కొంత కాలంగా అక్క‌డ కూడా కేసులు పెర‌గ‌లేదు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లోనే 5,038 కొత్త కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయ‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారిక వ‌ర్గాలు తెలిపాయి. క‌రోనా వ‌ల్ల 35 మంది చ‌నిపోయార‌ని నిర్ధారించాయి. నిన్న 4656 కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయి. నిన్న‌టి కంటే ఈరోజు కేసులు పెర‌గ‌డం కొంచెం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. 

click me!