కేరళాలో ఒకే రోజు 5,038 కొత్త కరోనా కేసులు, 35 మరణాలు

By team teluguFirst Published Dec 8, 2021, 10:32 PM IST
Highlights


పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేరళలో ఒకే రోజు 5,038 కొత్త కేసులు భయటపడగా 35 మంది మరణించారు. ఢిల్లీలో కరోనా వల్ల ఒకరు మరణించారు. 

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 8439 కొత్త క‌రోనా కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వ అధికార వ‌ర్గాలు తెలిపాయి. 195 మంది చ‌నిపోయార‌ని పేర్కొంది. 9525 మంది కోలుకున్నార‌ని తెలిపింది. చాలా రోజులుగా నెమ్మ‌దిగా సాగిన క‌రోనా పాజిటివిటీ రేటు.. ఇప్పుడిప్పుడే వేగంగా పెరుగుతోంది. నిన్న వ‌చ్చిన కేసులు కంటే ఈరోజు ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన కేసుల వివ‌రాల‌ను బ‌ట్టి చూస్తే 23 శాతం పెరిగింద‌ని తెలుస్తోంది. అయితే ఇందులో దాదాపుగా బ‌య‌ట‌ప‌డేవి డెల్టా వేరియంట్ కేసులే కావ‌డం కొంత ఉప‌ష‌మ‌నం క‌ల్గించే అంశం. 

కేరళాలో వేగంగా పెరుగుద‌ల‌..
భార‌తదేశంలో క‌రోనా కేసులు మొట్ట మొద‌టి సారిగా కేర‌ళ‌లోనే భ‌య‌ట‌ప‌డ్డాయి. మొద‌టి వేవ్‌లో క‌రోనాను అడ్డుకోవ‌డానికి కేర‌ళ ప్ర‌భుత్వం తీవ్రంగా శ్ర‌మించింది. అక్క‌డ ప్ర‌భుత్వ వైద్య వ్య‌వ‌స్థ కింది స్థాయి వ‌ర‌కు ప‌టిష్టంగా ఉండ‌టం వ‌ల్ల క‌రోనాను తొంద‌ర‌గానే అదుపులోకి తీసుకొచ్చింది. గ‌తం కొంత కాలంగా అక్క‌డ కూడా కేసులు పెర‌గ‌లేదు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లోనే 5,038 కొత్త కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయ‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారిక వ‌ర్గాలు తెలిపాయి. క‌రోనా వ‌ల్ల 35 మంది చ‌నిపోయార‌ని నిర్ధారించాయి. నిన్న 4656 కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయి. నిన్న‌టి కంటే ఈరోజు కేసులు పెర‌గ‌డం కొంచెం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. 

దేశ రాజ‌ధానిలో ఒక‌రు మృతి.. 404 కొత్త కేసులు
దేశ రాజ‌ధాని ఢిల్లీలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో ఢిల్లీలో కొత్త‌గా 65 క‌రోనా కేసులు వ‌చ్చాయ‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనాతో ఒక‌రు మృతి చెందార‌ని ధృవీకరించింది. ఢిల్లీలో గ‌త కొన్ని నెల‌లుగా పెద్ద‌గా క‌రోనా కేసులు న‌మోదు కాలేదు. కానీ ఇటీవ‌ల పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈరోజు భ‌య‌ట‌ప‌డిన కేసుల‌తో క‌లిసి ఢిల్లీలో మొత్తంగా 404 ఢిల్లీలో యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. 

https://telugu.asianetnews.com/andhra-pradesh/181-new-corona-cases-reported-in-andhra-pradesh-r3sx7x

రెండు డ‌జ‌న్ల‌కు చేరిన ఓమ్రికాన్ కేసులు..
ఢిల్లీతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో కూడా క‌రోనా కేసులు ఇటీవ‌ల పెరుగుతున్నాయి. అయితే అందులో దాదాపుగా అన్ని కేసులు డెల్టా వేరియంట్‌కు సంబంధించిన‌వే ఉంటున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో పుట్టిన ఓమ్రికాన్ వేరియంట్‌కు సంబంధించిన కేసులు దేశంలోనే మొద‌ట‌గా క‌ర్నాట‌క‌లోని బెంగుళూరులో భ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ కేసులు భ‌య‌ట‌ప‌డి వారం రోజులు దాటింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఓమ్రికాన్ వేరియంట్ 24 వ‌ర‌కు భ‌య‌ట‌ప‌డ్డాయ‌ని అధికారులు చెబుతున్నారు..

అప్ర‌మ‌త్తంగా ఉన్నకేంద్ర ప్ర‌భుత్వం..
ఓమ్రికాన్ వేరియంట్ ఇత‌ర దేశాల్లో వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. ఇది వ‌ర‌కే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రుల‌తో, ముఖ్య అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఓమ్రికాన్ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలు అలెర్ట్‌గా ఉండాల‌ని సూచించారు. ఒక వేళ ఓమ్రికాన్ భార‌త్‌లో విస్త‌రిస్తే, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. గ‌త రెండు వేవ్ లో జ‌రిగిన అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని  ఆదేశించారు. అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు సిద్ధం చేసుకోవాల‌ని తెలిపారు. 
 

click me!