అంబులెన్స్‌లో నిండు గర్బిణీ.. చుట్టూ సింహాలు: అదో కాళరాత్రి

By Siva KodatiFirst Published May 21, 2020, 5:20 PM IST
Highlights

ఒక సింహాం కనిపిస్తనే మన వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి పదుల సంఖ్యలో సింహాలు ఉంటే పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అచ్చం ఇలాంటి పరిస్ధితినే ఓ నిండు గర్భిణీ అనుభవించింది.

ఒక సింహాం కనిపిస్తనే మన వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి పదుల సంఖ్యలో సింహాలు ఉంటే పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అచ్చం ఇలాంటి పరిస్ధితినే ఓ నిండు గర్భిణీ అనుభవించింది.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతం సింహాలకు ప్రసిద్ధి. అక్కడి స్థానికులకు వీటితో సహవాసం తప్పదు. ప్రతినిత్యం ఏదో ఒక పనిపై వెళ్లే వారికి సింహాలు కనిపిస్తూనే ఉంటాయి.

ఈ క్రమంలో ఓ నిండు గర్బిణీ ఓ భయంకరమైన పరిస్ధితిని ఎదుర్కొంది. గిర్ సోమ్‌నాథ్ ప్రాంతంలో నివసిస్తున్న ఆమెకు ఉన్నట్లుండి అర్ధరాత్రి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

క్షణాల్లో అంబులెన్స్, వైద్య సిబ్బంది ఆమె ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి దగ్గరలోని ఆసుపత్రికి వీరి ప్రయాణం ప్రారంభమైంది. ఇక్కడే ఓ సమస్య ఎదురైంది. వీరి అంబులెన్స్‌ గిర్ అటవీ ప్రాంతం గుండా వెళ్లాలి. సరిగ్గా అడవి మధ్యలోకి వెళ్లిన తర్వాత వాహనానికి నాలుగు సింహాలు అడ్డొచ్చాయి.

దీంతో డ్రైవర్ అంబులెన్స్‌ను పక్కనే నిలిపివుంచాడు. ఇదే సమయంలో గర్బిణీకి పురిటి మరింత ఎక్కువయ్యాయి. అంబులెన్స్ ఎటూ కదలడానికి వీలు లేకుండా సింహాలు చుట్టూ రౌండప్ చేశాయి.

దీంతో అంబులెన్స్‌లో ఉన్న అత్యవసర సిబ్బంది అన్నీ తామే అయి పురుడు పోశారు. ఈ సందర్భంగా ఆ గర్బిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం పూర్తయిన తర్వాత చికిత్స నిమిత్తం తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది సిద్ధమయ్యారు.

కానీ దాదాపు అరగంట పాటు సింహాలు అక్కడి నుంచి కదల్లేదు. ఎట్టకేలకు అవి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. 

click me!