కనిష్టం రూ. 3,500, గరిష్టం రూ. 10 వేలు: కొత్త విమాన ఛార్జీలు ఇవే

By narsimha lodeFirst Published May 21, 2020, 4:38 PM IST
Highlights

ఎయిర్ లైన్స్ రూట్లను ఏడు సెక్షన్లుగా విభజించినట్టుగా కేంద్ర విమానాయాన శాఖ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్న తరుణంలో సివిల్ ఏవియేషన్ శాఖ అధికారులు కీలక అంశాలను ప్రకటించారు.


న్యూఢిల్లీ:ఎయిర్ లైన్స్ రూట్లను ఏడు సెక్షన్లుగా విభజించినట్టుగా కేంద్ర విమానాయాన శాఖ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్న తరుణంలో సివిల్ ఏవియేషన్ శాఖ అధికారులు కీలక అంశాలను ప్రకటించారు.

సివిల్ ఏవియేషన్ సెక్రటరీ  హర్ దీప్ సింగ్ పూరీ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ఫస్ట్ సెక్షన్ లో  40 నిమిషాలవరకు, రెండో సెక్షన్ లో 40 నుండి 60 నిమిషాల వరకు మూడో సెక్షన్ లో 60 నిమిషాల నుండి 90 నిమిషాల వరకు నాలుగో సెక్షన్ లో 90 నుండి 120 వరకు, ఐదో సెక్షన్ లో 120 నుండి 150 నిమిషాలు, ఆరో సెక్షన్ లో 150 నుండి 180 నిమిషాలు,  ఏడో సెక్షన్లో 180 నుండి 210 నిమిషాల మధ్య విమానాలు నడుస్తాయి. 

మెట్రో నగరాల మధ్య 33 .33 శాతం ప్రయాణీకులను తరలించేందుకు  అనుమతి ఇచ్చినట్టుగా విమానాయాన శాఖ ప్రకటించింది. మెట్రో నుండి నాన్ మెట్రో నగరాలకు వంద కంటే తక్కువ ప్రయాణీకులకు అనుమతి ఉండే విమానాలకు అనుమతి ఇచ్చారు.

ఢిల్లీ నుండి ముంబైకి కనిష్ట టిక్కెట్టు ధర రూ. 3500గా నిర్ణయించారు. గరిష్ట ధర రూ. 10 వేలు.  90 నుండి 120 నిమిషాల పాటు విమాన ప్రయాణం ఉంటుందని విమానాయానశాఖ తెలిపింది.

also read:డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు ఈ నెల 25 నుండి అనుమతి: ప్రయాణీకులకు సూచనలు ఇవే.....

ఈ పద్దతి మూడు నెలల పాటు కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఆగష్టు 24వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగనుందని విమానాయాన శాఖ ప్రకటించింది.ఒక్క విమానంలో 40 శాతం టిక్కెట్లను రూ.6700 ల కంటే తక్కువ ధరకు ఒక్క టిక్కెట్టును విక్రయించేందుకు విమానాయానశాఖ అనుమతి ఇచ్చింది.

ఢిల్లీ- ముంబై విమానానం కనిష్ట టిక్కెట్టు ధర రూ. 3500 ,గరిష్ట ధర రూ. 10 వేలు. కనిష్ట, గరిష్ట ధరలు కాకుండా మధ్యస్థంగా ఉన్న రూ,6700 కంటె తక్కువ ధరకుఒక్క టిక్కెట్టు చొప్పున 40 శాతం టిక్కెట్లను విక్రయించేందుకు అనుమతి ఇచ్చినట్టుగా  సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రకటించారు.

click me!