మొదటి భార్యతో మళ్లీ పెళ్లికి.. రెండో భార్యకి తలాక్

Published : Oct 03, 2019, 10:03 AM IST
మొదటి భార్యతో మళ్లీ పెళ్లికి.. రెండో భార్యకి తలాక్

సారాంశం

 ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న జాకీర్‌ అనే వ్యక్తి చాలా కాలం క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు పదేళ్ల కిందట తలాక్‌ చెప్పి విడాకులిచ్చాడు.

దేశంలో త్రిపుల్ తలాక్ ని నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ... కొందరు భార్యలను త్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకుంటున్నారు. ఇలా చేస్తున్నవారిలో... విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఓ టెక్కీ కూడా తన భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న జాకీర్‌ అనే వ్యక్తి చాలా కాలం క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు పదేళ్ల కిందట తలాక్‌ చెప్పి విడాకులిచ్చాడు. తరువాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది రెండో భార్యకు పుట్టిన బిడ్డ గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందడంతో ఆమెకు కూడా కొన్నిరోజుల కిందట తలాక్‌ చెప్పేశాడు. మళ్లీ మొదటి భార్యను పునర్వివాహమాడాలని యత్నిస్తున్నాడు. దీంతో రెండో భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?