లలితా జ్యువెలరీ చోరీ కేసు.... ఐదుగురి అరెస్ట్

By telugu teamFirst Published Oct 3, 2019, 9:36 AM IST
Highlights

పుదుకొట్టైలోని ఓ లాడ్జీలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. పోలీసులు దొంగలు అక్కడ ఉన్నారని సమాచారంతో అక్కడకు వెళ్లగానే... వాళ్లను చూసిన నిందితులు లాడ్జి పై నుంచి కిందకు దూకేయడం గమనార్హం. నిందితులు కేరళ, మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. గతంలో ఈ దొంగల ముఠా దుప్పట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. 

ప్రముఖ లలితా జ్యువెలరీ  చోరీ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని లలితా జ్యువెలరీ షోరూంలో బుధవారం భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.13కోట్ల విలువైన నగలను దుండగులు చోరీ చేశారు. కాగా... నిందుతుల్లో ఐదుగురిని పోలీసులు పట్టుకోగలిగారు.

పుదుకొట్టైలోని ఓ లాడ్జీలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. పోలీసులు దొంగలు అక్కడ ఉన్నారని సమాచారంతో అక్కడకు వెళ్లగానే... వాళ్లను చూసిన నిందితులు లాడ్జి పై నుంచి కిందకు దూకేయడం గమనార్హం. నిందితులు కేరళ, మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. గతంలో ఈ దొంగల ముఠా దుప్పట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. 

లలితా జ్యెవలరీ దుకాణంలో దాదాపు రూ.13 కోట్ల విలువచేసే ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు  చెప్పారు. దుకాణంలోని  గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రదర్శన కోసం ఉంచిన నగలు బుధవారం ఉదయానికి మాయమయ్యాయి. షోరూం వెనుక గోడకు కన్నం వేసి ఉంది. దుండగులు తమ వేలిముద్రలు ఫోరెన్సిక్‌ నిపుణులకు దొరక్కుండా ఉండేందుకు కారప్పొడి చల్లి వెళ్లారు. ముఖాలకు జోకర్‌ బొమ్మల మాస్క్‌లు వేసుకుని షోరూంలో సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

click me!