మహిళ ఫిర్యాదు.. మరుగుదొడ్డి కడిగిన మంత్రి

Published : Aug 03, 2020, 02:46 PM IST
మహిళ ఫిర్యాదు.. మరుగుదొడ్డి కడిగిన మంత్రి

సారాంశం

మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడంలేదని కమిషనర్‌ కార్యాలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.


ఓ మహిళ ఫిర్యాదు తో స్వయానా మంత్రి.. మరుగు దొడ్లు కడిగారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్‌ తోమర్ గ్వాలియర్‌లోని కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తరువాత మరుగుదొడ్లు శుభ్రపరిచే సామాన్లలను అందించాలని కోరిన ఆయన. స్వయంగా  పౌర రక్షణా సిబ్బందితో కలిసి అక్కడి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. 
మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడంలేదని కమిషనర్‌ కార్యాలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆయన విలేకరలతో మాట్లాడుతూ, ‘మరుగుదొడ్లు అందరికి ముఖ్యం. మరుదొడ్లు సరిగా లేకపోతే మహిళలు చాలా ఇబ్బందులను ఎదరుర్కొంటారు. 

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పరిసరాల పరిశుభ్ర కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఉపయోగపడేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. తోమర్‌ మార్చి నెలలో కాంగ్రెస్‌ నుంచి  బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu