ప్రియుడు మాట్లాడడం లేదని విషం తాగుతూ సెల్ఫీ వీడియో.. చివరికి..

Published : Nov 26, 2022, 09:48 AM ISTUpdated : Dec 01, 2022, 10:24 PM IST
ప్రియుడు మాట్లాడడం లేదని విషం తాగుతూ సెల్ఫీ వీడియో.. చివరికి..

సారాంశం

ప్రియుడు మాట్లాడడ లేదని మనస్తాపంతో ఓ యువతి విషం తాగింది. దాన్ని సెల్ఫీ వీడియో తీసుకుని ప్రియుడికి పంపింది. చివరికి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించింది. 

చెన్నై : ప్రియుడు మాట్లాడడం లేదని ఓ ప్రియురాలు దారుణానికి ఒడిగట్టింది. విషం తాగుతూ వీడియో తీసుకుంది. ఆ తరువాత ఆ వీడియోను ప్రియుడికి ఫార్వర్డ్ చేసింది. అనంతరం ఆత్మహత్య చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని కరుణానిధి గ్రామానికి చెందిన తిరుమాల్ కుమార్తె శరణ్య (23). ఆమె క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కాలేజీలో ఎంఏ ఫస్ట ఇయర్ చదువుతోంది. ఈమె అదే గ్రామానికి చెందిన అరుణ్ ఆర్మీ లో సిపాయిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకున్నారు. 

వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం వీరి మధ్య మాటలు లేవు. శరణ్య ఎంత ప్రయత్నించినా అరుణ్ మాట్లాడడం లేదు. దీంతో శరణ్య మనోవేదన చెందింది. చనిపోవాలనుకుంది. ఈ నెల 11వ తేదీన కూల్డ్రింక్లో విషం కలుపుకుంది. అది తాగుతూ.. దాన్నంతా సెల్ ఫోన్ లో  వీడియోలో రికార్డు చేసింది. తన కోసం చనిపోతున్నానంటూ ఆ వీడియోను ప్రియుడికి పంపించింది. ఆ తరువాత విషం ప్రభావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. అది గమనించిన శరణ్య కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మొదట తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా ఆమె పరిస్థితి విషమంగా మారింది.

దారుణం... సవితి పిల్లలకు చికెన్ లో విషం కలిపి తినిపించిన మహిళ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

దీంతో అక్కడినుంచి సేలం ప్రభుత్వ ఆస్పత్రికి శరణ్యను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆమె మృతి చెందింది. ప్రియుడు మాట్లాడడం లేదని అతడిని బెదిరించేందుకు విషం తాగి, దానికి చికిత్స పొందుతూ శరణ్య మృతి చెందడంతో.. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు సూసైడ్ కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu