chicken curry : వద్దంటున్నా భర్త చికెన్ తిన్నాడని.. కిరోసిన్ పోసుకుని భార్య ఆత్మహత్య !

Published : Aug 24, 2021, 02:48 PM IST
chicken curry : వద్దంటున్నా భర్త చికెన్ తిన్నాడని.. కిరోసిన్ పోసుకుని భార్య ఆత్మహత్య !

సారాంశం

మనీషా సింగ్ (19) ఆదివారం రక్షా బంధన్ రోజున తన భర్త రామజన్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రానికి వచ్చారు. ఇంతలో రామజన్మ తమ ఇంటిపక్కనే ఉన్న అత్తఇంటికి వెళ్లి చికెన్ తింటున్నాడు. అది చూసిన మనీషా తినొద్దని వారించింది. అయినా రామ్ జన్మ తన భార్య మాటను పెడచెవిన పెట్టి చికెన్ తిన్నాడు. 

రాయ్ పూర్ : భర్త చికెన్ తిన్నాడని కోపంతో ఓ మహిళ క్షణికావేశంలో తన ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ సూరజ్ పుర్ లో చోటు చేసుకుంది. కరౌదా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆగస్టు 22న తన బంధువుల ఇంట్లో చికెన్ తిన్నాడు. ఇదే ఈ దారుణానికి కారణమయ్యింది. చికెన్ తింటే ఇంత దారుణమైన నిర్ణయమా.. అంటే అతను చికెన్ తిన్నది శ్రావణ మాసం చివరి రోజు కావడమే ఆ భార్య మనసును బాధపెట్టింది. 

చాలామంది శ్రావణమాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికోసం ఇంట్లో వండడంకానీ, బయట తినడం కానీ చేయరు. అయితే కొందరు దీన్ని చూసి చూడకుండా వదిలేస్తే.. మరికొందరు కాస్త ఎక్కువ చాదస్తంగానే దీన్ని పాటిస్తుంటారు. ఈ ఘటనలోనూ అదే జరిగింది. వివరాల్లోకి వెడితే.. 

మనీషా సింగ్ (19) ఆదివారం రక్షా బంధన్ రోజున తన భర్త రామజన్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రానికి వచ్చారు. ఇంతలో రామజన్మ తమ ఇంటిపక్కనే ఉన్న అత్తఇంటికి వెళ్లి చికెన్ తింటున్నాడు. అది చూసిన మనీషా తినొద్దని వారించింది. అయినా రామ్ జన్మ తన భార్య మాటను పెడచెవిన పెట్టి చికెన్ తిన్నాడు. 

శ్రావణ మాసం చివరి రోజు, రక్షా బంధన్ కూడా కనుక చికెన్ తినడం వల్ల పొరపాటు చేస్తున్నావని మనీషా తన భర్తకు చెప్పి అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత రామజన్మ ఆమెకు నచ్చజెప్పడానికి ఇంటికి వెళ్లగా, అప్పటికే ఆమె క్షణికావేశంలో ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అతను తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే శరీరం చాలా మేరకు కాలిపోయింది. వెంటనే ఆమెను అంబికాపుర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించనప్పుటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. 

PREV
click me!

Recommended Stories

Illegal Liquor: సీజ్ చేసిన మద్యాన్నిగుజరాత్ పోలీస్ లు ఏం చేస్తున్నారో చూడండి | Asianet News Telugu
NEET Exam Paper Leak: నీట్ రీ-ఎగ్జామ్ పేప‌ర్ మ‌ళ్లీ లీక్ అయ్యిందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం