కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో మహిళ ఆత్మహత్య: మంచి ఫ్రెండ్ అని సింఘార్

Published : May 17, 2021, 05:05 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో మహిళ ఆత్మహత్య: మంచి ఫ్రెండ్ అని సింఘార్

సారాంశం

మధ్యప్రదేశ్ కాంగ్రెసు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమాంగ్ సింఘార్ కు చెందిన భవనంలో అంబాలకు చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా లభించింది.

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెసు ఎమ్మెల్యే ఉమాంగ్ సంఘార్ కు చెందిన భవనంలో 38 మహిళ ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఈ సంఘటన జరిగింది. సంఘటనా స్థలంలో మహిళ రాసిన సూసైడ్ నోట్ తమకు లభించినట్లు పోలీసులు తెలిపారు. 

సింఘార్ ను ఉద్దేశించి ఆమె ఆ లేఖ రాసింది. తన జీవితంలో ఓ స్థానం కోసం తాను తపించానని, అది తనకు లభ్యం కాలేదని ఆమె ఆ నోట్ లో రాసింది. ఇక ఏ మాత్రం జీవనాన్ని సాగించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూడా అందులో రాసింది. 

గంధ్వాని నియోజకవర్గం నుంచి శానసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింఘార్ ఆ మహిళ మంచి స్నేహితురాలని, మానసిక స్థితి బాగాలేక ఆమె చికిత్స తీసుకుంటున్న విషయం తనకు తెలియదని అన్నారు. 

అంబాలకు చెందిన ఆ మహిళ ఏడాది కాలంగా సింఘార్ నివాసానికి వస్తూ ఉందని పోలీసులు చెప్పారు. ఆ భవనంలో ఆమె 25, 30 రోజులుగా ఉంటోందని అన్నారు. గత రెండు రోజులుగా సింఘార్ భోపాల్ లో లేరు. 

బంగళాలో ఓ పని మనిషి, అతని భార్య ఉంటున్నారని, ఆదివారం ఉదయం పని మనిషి భార్య తలుపు తట్టిందని, అయితే లోపలి నుంచి ఏ విధమైన స్పందన కూడా రాలేదని, దాంతో పని మనిషి గణేష్ ఆ విషయం సింఘార్ కు చె్పపాడని, దాంతో ఆయన తన బంధువును అక్కడికి పంపించారని, సీలింగ్ కు వేలాడుతూ మహిళ మృతదేహం కనిపించిందని అదనపు ఎస్పీ రాజేశ్ సింగ్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?