లవర్ చీట్ చేశాడు.. రద్దీ రోడ్డుపై రచ్చ రచ్చ చేసిన యువతి.. వైరల్ వీడియో ఇదే

Published : Apr 01, 2023, 04:20 PM IST
లవర్ చీట్ చేశాడు.. రద్దీ రోడ్డుపై రచ్చ రచ్చ చేసిన యువతి.. వైరల్ వీడియో ఇదే

సారాంశం

ప్రేమలో మోసపోయిన ఓ యువతి నడి రోడ్డపై రచ్చ చేసింది. రద్దీగా ఉన్న రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డుకుంది. అరుపులు వేసింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

Viral Video: ప్రేమలో ఎవరు ద్రోహం చేసినా మరొకరు తట్టుకోలేరు. నిజాయితీగా ప్రేమించిన భాగస్వామి భంగపడక తప్పదు. కొన్ని సార్లు కొందరు మానసికంగా చెదిరిపోతారు. ఆ మోసాన్ని జీర్ణించుకోలేక ఆవేదనతో రగిలిపోతారు. ప్రేళాపనలు చేస్తారు. బహిరంగంగా విచక్షణ మరిచి ప్రవర్తిస్తారు. ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ప్రియుడి మోసాన్ని భరించలేక ఓ యువతి రద్దీ రోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. 

బారికేడ్‌ను నెట్టేసింది. టూ వీలర్‌లకు ఆటంకం కలిగించింది. ఓ కారు బానెట్ పై కూర్చుని రచ్చ చేసింది. వైపర్‌ను పట్టుకుని చిందులేసింది. ఈ సమయంలోనే కొందరు మహిళలు అక్కడికి వచ్చారు. ఆమె చుట్టూ గుమిగూడారు. ఆ కారు నుంచి కిందికి దింపేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొందరు పోలీసులు కూడా వీడియోలో కనిపించారు. నడి రోడ్డుపై ఆమె నానా రభస చేశారు.

వీడియోలో ఆమె ప్రవర్తన, భాష, కళ్లు చూస్తే మానసికంగా ఆమె గాయపడినట్టు అర్థం అవుతున్నది. అలాంటి వారికి నిపుణులతో చికిత్స అందించాలి. అది ఆమెకే కాక.. చుట్టుపక్కల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: పెళ్లి చేసుకుని భార్యగా నటించాలని యువతికి ఆఫర్.. ఆమెతో నిజంగానే ప్రేమలో పడ్డ భర్త.. చివరకు ఏమైందంటే?

ఆ యువతి వీడియోను వికాశ్ కుమార్ అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు. ప్రేమలో మోసపోయిన యువతి ఇలా వీరంగం సృష్టించిందని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పూల్ బాగ్‌లో జరిగినట్టు తెలుస్తున్నది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్