కార్డ్ స్వైప్ చేస్తూ ఎయిర్‌హెస్టెస్‌తో అసభ్య ప్రవర్తన.. అడ్డొచ్చిన ప్రయాణీకులపైనా దాడి, ఇండిగో ఫ్లైట్‌లో ఘటన

Siva Kodati |  
Published : Apr 01, 2023, 04:18 PM IST
కార్డ్ స్వైప్ చేస్తూ ఎయిర్‌హెస్టెస్‌తో అసభ్య ప్రవర్తన.. అడ్డొచ్చిన ప్రయాణీకులపైనా దాడి, ఇండిగో ఫ్లైట్‌లో ఘటన

సారాంశం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఓ ప్రయాణీకుడు నానా రచ్చ చేశాడు. కార్డ్ స్వైప్ చేసే వంకతో ఎయిర్‌హెస్టెస్‌ను అసభ్యంగా తాకాడు. అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇతర సిబ్బందిని, తోటి సిబ్బందిపైనా దాడి చేశాడు. 

ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాల్సిన విమానయాన సంస్థలు ఇటీవల వివాదాలను కోరి తెచ్చుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ ప్రయాణికుడు విమానంలో తోటి ప్రయాణీకురాలిపై మూత్రం పోసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇండిగో ఎయిర్‌లైన్స్ విషయంలో లెక్కలేనన్ని వివాదాలు వున్నాయి. తాజాగా ఇదే సంస్థకు చెందిన విమానంలో ఓ ప్రయాణీకుడు నానా రచ్చ చేశాడు. ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తోటి ప్రయాణీకులపై దాడి చేశాడు. బ్యాంకాక్ నుంచి ముంబైకి వస్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్ హోస్టెస్ చెప్పడంతో సదరు ప్రయాణీకుడు అనుచితంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె నచ్చజెప్పడంతో చికెన్ వంటకాన్ని తీసుకోవడానికి అంగీకరించాడు. దీనికి గాను నగదు వసూలు చేసేందుకు ఎయిర్ హోస్టెస్ స్వైపింగ్ మెషిన్ తీసుకునిరాగా.. కార్డ్ స్వైప్ చేసే వంకతో ఆమెను అతను అసభ్యంగా తాకాడు. దీనిని ఆమె ప్రతిఘటించగా.. నిందితుడు సీటులోంచి లేచి మరింత రెచ్చిపోయాడు. అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇతర సిబ్బందిని, తోటి సిబ్బందిపైనా దాడి చేశాడు. అనంతరం విమానం ముంబైలో ల్యాండ్ అవ్వగానే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని స్వీడన్ జాతీయుడైన 62 ఏళ్ల క్లాస్ ఎరిక్ ఎరాల్డ్ జోనాస్ వెస్ట్ బర్గ్‌గా గుర్తించారు. ఇతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. 

కాగా.. ఈ మధ్య కాలంలో విమానంలో అభ్యంతరకర ప్రవర్తన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో ఫ్లైట్‌లో వీరంగం సృష్టిస్తున్నారు. అందరి భ్రదతను ప్రమాదంలో నెట్టేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దుబాయ్ నుంచి ముంబయికి వచ్చిన ఫ్లైట్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు ఫుల్‌గా మద్యం తాగి తోటి ప్రయాణికులు, సిబ్బందిని దూషించారు. వద్దని వారించినా తాగడం మానలేదు. ఫ్లైట్‌లోనూ బాటిళ్లు పట్టుకుని సీట్ల మధ్య దారిలో తిరుగాడటం చేశారు. దీంతో వారి సిబ్బంది బాటిళ్లు లాగేసుకుంది. ఈ ప్రయాణికులపై ముంబయిలో కేసు ఫైల్ అయింది. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని అరెస్టు చేయగా కోర్టు బెయిల్ పై బయటకు వచ్చారని పోలీసులు గురువారం వెల్లడించారు.

Also REad: ఫుల్‌గా తాగి ఫ్లైట్‌లో వీరంగం.. తోటి ప్రయాణికులు, సిబ్బందితో గొడవ.. బాటిళ్లు లాక్కున్న క్రూ

దుబాయ్ నుంచి ముంబయికి ప్రయాణిస్తున్న ఫ్లైట్ 6E 1088‌లో ఇద్దరు ప్రయాణికులు మద్యం మత్తులో గొడవకు దిగారని ఇండిగో ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. సిబ్బంది పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయకుండా మద్యం సేవిస్తూనే ఉన్నారని వివరించింది. వారు క్రూ సిబ్బంది, తోటి ప్రయాణికులను దూషించారని తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం ఫ్లైట్‌ ముంబయిలో ల్యాండ్ అయిన తర్వాత వారిని సీఐఎస్ఎఫ్‌కు అప్పగించామని పేర్కొంది. సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వివరించింది.

పోలీసుల వివరాల ప్రకారం, పాల్ఘర్‌లోని నలసపోరా, కొల్హపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు గల్ఫ్‌లో ఏడాదిపాటు పని చేసి ఇంటికి వస్తున్నారు. పన్నులు వేయని షాపులో లిక్కర్ కొనుగోలు చేసి వారిద్దరూ సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు. వారి వల్ల కలుగుతున్న ఇబ్బంది కారణంగా తోటి ప్రయాణికులు వారిని వారించారు. జోక్యం చేసుకున్న సిబ్బందినీ, తోటి ప్రయాణికులను ఆ ఇద్దరు దూషించారు. ఆ ఇద్దరిలో ఒకరు సీట్ల మధ్యల నడుస్తూ బాటిల్ చేతిలో పట్టుకుని మద్యం తాగాడు. సిబ్బంది అతని దగ్గరి నుంచి బాటిల్ తీసుకెళ్లారు. సహర్ పోలీసు స్టేషన్‌లో వారిద్దరి పై కేసు ఫైల్ అయింది.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్