లక్షన్నర ఇచ్చి కూతుర్ని సజీవదహనం చేయించిన తండ్రి.. యూపీలో పరువు హత్య !!

Published : Feb 16, 2021, 11:28 AM IST
లక్షన్నర ఇచ్చి కూతుర్ని సజీవదహనం చేయించిన తండ్రి.. యూపీలో పరువు హత్య !!

సారాంశం

తన కూతురు ఓ ముస్లిం యువకుడి ప్రేమలో పడిందని ఆ తల్లిదండ్రులు దారుణానికి ఒడిగట్టారు. కన్నతీపిని మరిచి కాంట్రాక్ట్ కిల్లర్లతో అతి దారుణంగా సొంత కూతురినే చంపించారు. ఈ క్రూరమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నగర సమీపంలోని జిగిన గ్రామంలో జరిగింది. 

గోరఖ్ పూర్ లోని బెల్ఘాట్ ప్రాంతానికి చెందిన రంజనా యాదవ్ ఓ ముస్లిం యువకుడిని ప్రేమించింది. అతనితో ప్రేమను మర్చిపోవాలని తండ్రి చెప్పినా ఆమె తిరస్కరించింది. దీంతో పరువు కోసం కుమార్తెను తండ్రి, సోదరుడు, బావమరిది కలిసి చంపేందుకు నిర్ణయించుకున్నారు. 

దీనికోసం లక్షన్నర రూపాయలకు వరుణ్ తివారి అనే కాంట్రాక్ట్ కిల్లర్ కు ఇచ్చి రంజనను హత్య చేయించారు. వీరి సూచనల మేరకు రంజనా యాదవ్ ను కిడ్నాప్ చేసిన కాంట్రాక్ట్ కిల్లర్.. ఆమెను మోటారుసైకిలుపై జిగినా గ్రామంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఆమె చేతులు, నోరు కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. 

సగం కాలిన రంజన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితులను గుర్తించారు. ఈ కేసులో నిందితులైన రంజన తండ్రి కైలాస్ యాదవ్, సోదరుడు అజిత్ యాదవ్, బావమరిది సత్యప్రకాష్ యాదవ్, సీతారాం యాదవ్ లను అరెస్ట్ చేశామని ఎస్పీ కౌస్తుభ్ తెలిపారు. 

హత్యకు వాడిన పెట్రోల్ డబ్బా, మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాంట్రాక్ట్ కిల్లర్ కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పరువు కోసమే కుమార్తె రంజనను హత్య చేయించారని తేలిందని ఎస్పీ వివరించారు.
 
PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu