బంగారు నగలమ్మి మరీ సుపారీ... పెళ్లిరోజున భర్తను చంపించిన భార్య

Published : May 27, 2023, 01:54 PM ISTUpdated : May 27, 2023, 02:00 PM IST
బంగారు నగలమ్మి మరీ సుపారీ... పెళ్లిరోజున భర్తను చంపించిన భార్య

సారాంశం

కట్టుకున్న భర్తను భార్యే సుపారీ ఇచ్చిమరీ హత్యచేయించిన ఘోరం చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. 

చత్తీస్ ఘడ్ : బంగారు నగలు అమ్మిమరీ కట్టుకున్న భర్త హత్యకు సుపారీ ఇచ్చిందో మహిళ. అంతేకాదు పెళ్లిరోజునే భర్తను అతి దారుణంగా హత్యచేయించిన వివాహిత జైలుపాలయ్యింది. ఈ దారుణం చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...  చత్తీస్ ఘడ్ లోని కోర్బా జిల్లాకు చెందిన జగ్జీవన్ రామ్, ధనేశ్వరి భార్యాభర్తలు. తాగుడుకు బానిసైన జగ్జీవన్ రోజూ మద్యంమత్తులో ఇంటికి వచ్చి భార్యను చితబాదేవాడు. అతడి చిత్రహింసలు భరించలేక ధనేశ్వర్ దారుణ నిర్ణయం తీసుకుంది.

తాగుబోతు భర్త హత్యకు సిద్దమైన ధనేశ్వరి తుషార్ సోనీ అనే కిరాయి హంతకున్ని ఆశ్రయించింది.అతడికి తన బంగారు నగలు అమ్మిమరీ రూ.50వేలు అడ్వాన్స్ గా ఇచ్చింది. మిగిలిన డబ్బు భర్ హత్య తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. దీంతో తుషార్ సోనీ  జగ్జీవన్ రామ్ హత్యకు స్కెచ్ వేసాడు.  

Read More  కిరాతకం.. వృద్ధుడిని హత్య కేసిన యువజంట.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ట్రాలీబ్యాగులో వేసి..

జగ్జీవన్ రామ్‌-ధనేశ్వరి పెళ్లిరోజునే హత్యకు స్కెచ్ వేసాడు తుషార్. ధనేశ్వరి సాయంతో మద్యంమత్తులో వున్న జగ్జీవన్ రామ్ అతి దారుణంగా హతమార్చారు. అనంతరం తనకేమీ తెలియనట్లు భర్త  కనిపించడంలేదని నాటకమాడింది. పోలీసులకు కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది. 

జగ్జీవన్ రామ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ధనేశ్వరి తీరుపై అనుమానం వ్యక్తం చేసారు. ఆమెను విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టింది. దీంతో జగ్జీవన్ రామ్ ను హత్య చేసిన ఇద్దరు నిందితులతో పాటు ధనేశ్వరిని అరెస్ట్ చేసారు. వీరిని కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు