ఏనుగుల గుంపు దాడిలో మైన‌ర్ బాలిక స‌హా ఇద్ద‌రు మృతి

By Mahesh RajamoniFirst Published May 27, 2023, 1:27 PM IST
Highlights

Balasore: ఒడిశాలో వేర్వేరు ఏనుగుల దాడి ఘటనల్లో మైనర్ బాలిక సహా ఇద్దరు మృతి చెందారు. సుమారు ఎనిమిది ఏనుగుల గుంపు ఆవరణలోకి ప్రవేశించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను తొక్కిందని చెప్పారు.
 

A herd of elephants attack: ఒడిశాలో వేర్వేరు ఏనుగుల దాడి ఘటనల్లో మైనర్ బాలిక సహా ఇద్దరు మృతి చెందారు. సుమారు ఎనిమిది ఏనుగుల గుంపు ఆవరణలోకి ప్రవేశించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను తొక్కిందని చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే.. బాలాసోర్ జిల్లా ఎనుగుల గుంపు బీభ‌త్సం సృష్టించింది. ఎనిమిది ఎనుగుల‌తో కూడిన ఒక గుంపు దాడిలో మైన‌ర్ బాలిక స‌హా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు.  సోరో బ్లాక్ పరిధిలోని సరాలియా చిత్రసుల్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఎనిమిదేళ్ల బాలికను ఏనుగు తొక్కి చంపింది. తెల్లవారు జామున 2 గంటల సమయంలో బాలిక తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సుమారు ఎనిమిది ఏనుగుల గుంపు ఆవరణలోకి ప్రవేశించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను తొక్కింది.

కుటుంబ సభ్యులు మైనర్ బాలికను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 'ఏనుగు నా కుమార్తెపై దాడి చేయడంతో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించాం. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు' అని మృతురాలి తండ్రి సురేష్ దేవూరి క‌న్నీరు పెట్టుకున్నారు. మరో ఘటనలో నయాగఢ్ జిల్లాలో ఏనుగు దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని రాన్ పూర్ బ్లాక్ లోని నతిమ్ గ్రామానికి చెందిన సత్యబాది బెహెరాగా గుర్తించారు. బెహెరా మరో ఇద్దరు సహచరులతో కలిసి పనికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వారిపై ఒక్క‌సారిగా ఏనుగుల గుంపు దాడికి పాల్ప‌డింది.

click me!