
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఓ దారుణం జరిగింది. పరాయి మహిళను లోబరుచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన ఓ దుండగుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. అతని వేధింపులు భరించలేక భార్య భర్తలు ఇద్దరు కలిసి దారుణంగా హతమార్చారు. ఆ వ్యక్తి కళ్లకు ఆమె గంతలు కట్టి మంచానికి కాళ్లు, చేతులు కట్టేసింది. ఆ తర్వాత ఆమె భర్త ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌లో చోటుచేసుకుంది.
40 ఏళ్ల మెహ్రాజ్ పఠాన్.. తన మిత్రుడైన ఇమ్రాన్ భార్య రిజ్వానా సయ్యద్‌ను తరుచూ వేధించేవాడు. తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఏడాది కాలంగా వెంటపడుతున్నాడు. కానీ, ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ విషయం భర్తకు కూడా తెలిసింది. ఓ రోజు పఠాన్‌ను రిజ్వానా ఇంటికి పిలిచింది. సర్‌ప్రైజ్ ఇస్తానని ఆమె దుపట్టాతో కళ్లకు గంతలు కట్టింది. కాళ్లు, చేతులు బెడ్‌కు కట్టేసింది. వెంటనే భర్త కత్తితో పఠాన్ కడుపులో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తల నరికేశాడు. బాడీని ముక్కలు చేశాడు. ఆ ముక్కలను ఖారికట్ కెనాల్‌లో పడేశాడు. పఠాన్ హత్య కేసులో ఆ దంపతులు బుధవారం అరెస్టు అయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం, ‘పఠాన్ వేధింపులతో రిజ్వానా గాయపడింది. ఒంటరిగా తనతో కలువాలని, సంబంధం పెట్టుకోవాలని పఠాన్ తరుచూ వేధించాడు. తన పద్ధతి మార్చుకోవాలని ఇమ్రాన్, రిజ్వానాలు ఇద్దరూ పఠాన్‌కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. కానీ, పఠాన్ ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. చివరకు పఠాన్‌ను చంపేయాలనే నిర్ణయానికి ఆ దంపతులు వచ్చారు’ అని పోలీసులు వివరించారు.
‘చివరకు పఠాన్ దారిలోకి ఆమె వచ్చినట్టు రిజ్వానా నమ్మించింది. ఇంటికి రావాలని కాల్ చేసింది. ఇంటికి రాగానే పఠాన్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇస్తానని, కళ్లకు గంతలు కట్టడానికి, కాళ్లు, చేతులు బెడ్‌కు కట్టేయడానికి సహకరించాలని కోరింది. పఠాన్ కళ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులు బెడ్ ఫ్రేమ్‌కు కట్టేయగానే ఇమ్రాన్ ఆ గదిలోకి వచ్చాడు. కత్తితో పఠాన్ కడుపులో పలుమార్లు పొడిచాడు. పఠాన్ చనిపోయాడు’ అని తెలిపారు.
Also Read: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే మొబైల్ ఫోన్ లో పోర్న్!.. వీడియో వైరల్
ఆ దంపతులు పఠాన్‌ను ముక్కలుగా నరికేశారు. తలనూ వేరు చేశారు. అదే రోజు రాత్రి తలను బిన్‌లో పడేశారు. మరుసటి రోజు ఆ బాడీ పార్టులను సంచిలో చేర్చి కెనాల్‌లో పడేశారు.
పఠాన్ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి షకీనా, సోదరుడు ఇమ్రాన్ సలీం బాపూనగర్ పోలీసులను జనవరి 22న ఆశ్రయించారు. 24న కేసు ఫైల్ చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.
పఠాన్ తరుచూ ఇమ్రాన్‌తోనే ఎక్కువగా గడిపేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. రిజ్వానాకు దూరంగా ఉండాలని పఠాన్‌కు పలుమార్లు కుటుంబ సభ్యులు హెచ్చరించారని పోలీసులు కనుగొన్నారు. రిజ్వానా వెంటపడుతున్నట్టు ఆమె భర్త ఇమ్రాన్‌కు కూడా తెలుసు అని, అందుకే అటు వైపు వెళ్లొద్దను పఠాన్‌కు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.