లైంగిక వేధింపులు తాళలేక... కలెక్టరేట్ ఎదురుగా మహిళ ఆత్మహత్యాయత్నం..

Published : Feb 11, 2022, 10:58 AM IST
లైంగిక వేధింపులు తాళలేక... కలెక్టరేట్ ఎదురుగా మహిళ ఆత్మహత్యాయత్నం..

సారాంశం

కామాంధులు రెచ్చిపోయారు. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బతకడానికి వలస వచ్చిన వనితపై వేధింపులకు తెగబడ్డారు. వారి బాధ భరించలేక.. పోలీసులను ఆశ్రయించింది. అయినా పట్టించుకోకపోవడంతో.. చివరికి..

భువనేశ్వర్ : Sexual harassmentలతో డెంఖనాల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ బుధవారం Suicide Attemptకి పాల్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన రస్మితా రౌత్ భర్త ప్రేమ్ నాథ్ ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో.. పొట్టకూటి కోసం ఆమె రాష్ట్రానికి వలస వచ్చింది. తన ఇద్దరు పిల్లలతో కొల్లిపంగి గ్రామంలో నివసిస్తుంది.

అయితే స్థానిక గ్రామస్తులు కొందరు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో జనవరి 24న భాపూర్ పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో పాటు వేధింపులు అధికమయ్యాయి. దీంతో అభద్రతాభావానికి లోనైన రస్మితా.. తనకు న్యాయం చేయాలని దెంఖనాల్ కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకోవడానికి ప్రయత్నించింది.

పోలీసులు అడ్డుకోగా,  గాజు ముక్కతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించింది. నిలువరించిన సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7న హైదరాబాద్, ఛత్రినాకలోని ఓ పాఠశాలలో 4వ తరగతి studentపై పాఠశాల ఉపాధ్యాయుడు Sexual harassmentకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై Pocso Act, జువైనల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ ఉల్లంఘన కింద అభియోగాలు నమోదు చేశారు. Accused (35)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫిబ్రవరి 7న ఉదయం బాధితురాలు 8 గంటల ప్రాంతంలో schoolకు వచ్చింది. అప్పటికి ఇంకా ఆమె క్లాస్ లోని విద్యార్థులెవ్వరూ రాలేదు. దీంతో ఒంటరిగా గదిలో కూర్చుంది. “విద్యార్థి తరగతి గదిలో ఒంటరిగా ఉండడం చూసిన నిందితుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆ చిన్నారి బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు. దీంతో భయపడ్డ బాలిక కేకలు వేసింది. దీంతో నిందితుడు బాధితురాలిని అరవొద్దు అంటూ గట్టిగా కొట్టాడు. బాలిక అరుపులు విన్న పాఠశాలలోని ఇతర సిబ్బంది ఆ బాలికను రక్షించారు” అని ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు.

ఘటనపై పాఠశాల యాజమాన్యం బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్కూలుకు చేరుకుని బాలికతో సహా పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఉపాధ్యాయుడి మీద ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు mentally disturbedగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఘటనలో  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి భద్రత దృష్ట్యా ఆమె గుర్తింపును బయటపెట్టలేదు. అయితే నిందితుడిని కూడా రివీల్ చేయకపోవడం మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా, Karnataka లోని శివమొగ్గలో దారుణ ఘటన జరిగింది. Minor అయిన భార్య చెల్లెలిని మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేశాడో కీచక బావ. సదరు బావ మీద జిల్లాలోని కుంసి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న బాలికను తోబుట్టువుల చూసుకోవాల్సిన brother-in-law ఆమె మీద కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకుని sexual desires తీర్చుకుంటున్నాడు. 

ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ బాలిక ఏడు నెలల pregnant అని వైద్యులు తెలిపారు. దీంతో అక్క షాక్ కు గురైంది. తరువాత బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుంది. బయటికి పొక్కితే సంసారం ఇబ్బందుల్లో పడుతుందనుకుందో ఏమో.. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి.. గొడవలు లేకుండా ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం బాలికకు నొప్పులు రాగా మెగ్లాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు.  ఏడు నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సదరు కీచక బావను కటకటాల్లో కి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్