అక్రమసంబంధాన్ని వద్దన్నాడని.. ప్రియులతో కలిసి భర్తను కొట్టి.. ఓ భార్య ఘాతుకం...

Published : May 05, 2022, 12:39 PM IST
అక్రమసంబంధాన్ని వద్దన్నాడని.. ప్రియులతో కలిసి భర్తను కొట్టి.. ఓ భార్య ఘాతుకం...

సారాంశం

వివాహేతర సంబంధం వద్దన్నాడని ఓ భార్య ఘాతుకానికి తెగించింది. కట్టుకున్న భర్తనే ప్రియులతో కలిసి కొట్టి చంపింది. ఆ తరువాత ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యారు. 

రాజస్థాన్ : ఊర్లో జరిగే ఫంక్షన్లలో పాటల కార్యక్రమాలు నిర్వహించే అర్జున్ (22) అనే యువకుడికి కొంతకాలం క్రితం పెళ్లయింది. అతని భార్య రాజకీ వేరే వాళ్ళతో Extramarital affairలు పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన అర్జున్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తాజాగా భార్య రాజకీ, ఆమె ముగ్గురు సోదరులు సవాయీరామ్, మదన్, జేఠారామ్... అర్జున్ ను party చేసుకుందాం రమ్మని పిలిచారు. ఊరికి దూరంగా తీసుకుపోయి liquor తాగించారు. మద్యం మత్తులో మళ్లీ భార్య వివాహేతర సంబంధాల గురించి చర్చ రావడంతో అర్జున్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. భార్యను తిట్టిపోశాడు.  

దీంతో మొత్తం ఐదుగురు కలిసి అర్జున్ ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. స్పృహ కోల్పోయిన అతడిని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి పరారయ్యారు. ఈ ఘటన  రాజస్థాన్ లోని బాడ్‌మేర్‌లో వెలుగు చూసింది. విషయం తెలిసిన అర్జున్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అర్జున్ భార్య రాజకీకి మదన్, జేఠారామ్ తో వివాహేతర సంబంధం ఉందని, ఆమె దానిని కొనసాగించాలని అనుకుందని ఆరోపించారు దీనికి అభ్యంతరం చెప్పినందుకే తన సోదరుడిని హత్య చేశారని కేసు పెట్టాడు. ఈ ఘటనతో సంబంధమున్న నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.

ఇదిలా ఉండగా,  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాణి, ఆమె భర్త శంకర్ రెడ్డి కర్నాటకలోని యశ్వంతపూర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి 7 ఏళ్ల వయసున్న బాబు ఉన్నాడు.  శంకర్ రెడ్డి ఒక ప్రైవేటు కంపెనీ లో అకౌంటెంట్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.   శంకర్రెడ్డి భార్య రాణి ఇంటి దగ్గరే ఉండి పిల్లాడి బాగోగులు చూసుకునేది. అప్పుడప్పుడు ఆమె పుట్టింటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో ఆ ఊరిలోని ఒక వ్యక్తితో రాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఆఫీస్ కి వెళ్ళగానే గంటలతరబడి ప్రియుడితో కాల్స్, భర్తకు తెలియకుండా వాట్స్అప్ చాటింగ్ చేస్తూ గడిపింది. చివరికి రాణి, ఆమె ప్రియుడు ఒక నిర్ణయానికి వచ్చారు. శంకర్ రెడ్డి ని చంపేసి,  ఆ హత్యను ఒక దోపిడీ చిత్రీకరించి కేసు నుంచి బయటపడాలని ప్లాన్ చేశారు. 

గత గురువారం మధ్య రాత్రి  పిల్లాడికి  మెలుకువ వచ్చి చూసే సరికి కిశంకర్ రెడ్డి అతని భార్య రాణి రక్తపు మడుగులో పడి ఉన్నారు.  అమ్మనాన్నను ఆ స్తితిలో చూసిన పిల్లాడు ఏడుస్తూ కేకలు వేశాడు. దగ్గర్లో ఉన్న ఇంటి ఓనర్ ఇంటికి ఏడుస్తూ వెళ్లి విషయం చెప్పాడు. ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని రాణి, ఆమె భర్త శంకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. శంకర్ రెడ్డి చనిపోయాడు అని డాక్టర్లు వెల్లడించారు. గాయపడిన రాణి  కోలుకుంది.

రాణిని పోలీసులు విచారించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి.. తనను, తన భర్తను కత్తితో గాయపరిచాడని ఆమె చెప్పింది. అక్కడినుంచి పారిపోయాడు అని పోలీసులకు తెలిపింది. అయితే రాణి చెప్పిన విషయం పోలీసులకు నమ్మశక్యంగా అనిపించలేదు. క్రైమ్ సీన్ ను పరిశీలించగా పోలీసులకు విషయం అర్థమైపోయింది. బలవంతంగా ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడినట్లు అనిపించలేదు. ఆమె తనకు తానుగా గాయ పరచుకుని నాటకం ఆడుతోందని పోలీసులకు అనుమానం వచ్చింది. రాణి ఫోన్ ను, కాల్ డేటాను  పరిశీలించగా  అసలు విషయం ఏమిటో తెలిసి వచ్చింది.  

రాణినే  తన భర్తను కత్తితో పొడిచి చంపిన్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. వివాహేతర సంబంధం పెట్టుకొని..  అతని కోసం తన భర్తను హత్య చేసినట్లు తేల్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి, ఆమె ప్రియుడి  కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో రాణి  ప్రియుడి  పాత్రపై  ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు