
బెంగళూరు : అధిక వడ్డీలకు ఆశపడి 55 ఏళ్ల మహిళ ప్రాణం పోగొట్టుకున్న ఘటన Bangaloreలో వెలుగు చూసింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే.. బెంగళూరులోని కచమరనహళ్లి ప్రాంతంలోని JJ Layoutకు చెందిన కిరణ్ కుమార్, షేక్ ఇమ్రాన్, ఆర్ వెంకటేష్ స్నేహితులు. గోవిందపురం ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ auto driver. ఆర్ వెంకటేష్ ప్లంబర్ గా పనిచేస్తుండేవాడు. కిరణ్ కుమార్ కు మల్లేశ్వర ప్రాంతానికి చెందిన ప్రాంతానికి చెందిన సునీత రాంప్రసాద్ అనే 55 ఏళ్ల మహిళ ఇమ్రాన్ ద్వారా పరిచయం అయింది.
ఆమె దగ్గర పెద్దమొత్తంలో డబ్బు ఉందన్న విషయం తెలుసుకున్న కిరణ్ ఆ డబ్బు ఎలాగైనా చేయాలని ఫిక్స్ అయ్యాడు. మాయమాటలతో ఆమెను నమ్మించి ఆ డబ్బును సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆమె వద్ద ఉన్న డబ్బు ఇస్తే అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టాడు. అతని ట్రాప్ లో పడిన సునీత పెద్ద మొత్తంలో వడ్డీ వస్తుందని ఆశ పడింది. ఇటీవల తన దగ్గర ఉన్న రూ. 16 లక్షల డబ్బు తీసుకుని వర్తూర్ లోని కిరణ్ ఇంటికి వెళ్ళింది. కిరణ్, ఆమె స్నేహితులు ఆమెను ఒక ఖాళీ ఇంటికి తీసుకువెళ్లి హత్య చేశారు. ఆమె వద్ద ఉన్న రూ.16 లక్షలు తీసుకుని పరారయ్యారు.
పోలీసులు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరిపారు. కాజేసిన ఆ డబ్బుతో కిరణ్ గోవా వెళ్లి పోయాడు. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జల్సా చేశాడు. కిరణ్ ను పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. కేసు విచారణలో పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. ఒంటరిగా ఉంటున్న సునీత బయటకు వెళ్లడానికి అప్పుడప్పుడూ ఇమ్రాన్ ఆటోలోనే వెళ్ళేది. అలా emraan ఆమెకు తెలుసు. ఆమె దగ్గర డబ్బు ఉందన్న విషయం తెలుసుకున్న ఇమ్రాన్ తన స్నేహితుడు కిరణ్ ను ఒక ఫైనాన్షియర్ గా సునీతకు పరిచయం చేశాడు.
తాను వడ్డీకి డబ్బులివ్వాలని చూస్తున్నానని, కానీ, నమ్మి డబ్బులివ్వాలంటే భయంగా ఉందని సునీత కిరణ్ తో చెప్పింది. ఆమె చెప్పింది విన్న కిరణ్. తనకు చాలామంది ప్రైవేట్ బ్యాంకు అధికారులు తెలుసని, ఎక్కువ వడ్డీని తాను ఇప్పిస్తానని ఆమెను నమ్మబలికాడు. దీంతో కిరణ్ మాటలు నమ్మి డబ్బుతో సునీత అతని ఇంటికి వెళ్లగా ఈ ఘోరం జరిగింది. కిరణ్ ఇంటికి సునీత వెళ్లిన సమయంలో అతని భార్య ఇంట్లో ఉంది. మూడో ఫ్లోర్ లో కిరణ్ అద్దుకు ఉండేవాడు. కింద రెండు ఫ్లోర్లు ఎవరైనా ఇల్లు అద్దెకు కావాలని వస్తే చూపించమని కిరణ్ కు ఇంటి యజమాని కీస్ ఇచ్చి వెళ్లాడు. ఆ ఖాళీగా ఉన్న ఇంట్లోకి సునీతను తీసుకెళ్లి కిరణ్, అతని స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సునీత మృతదేహాన్ని మాయం చేయాలని కిరణ్, అతని స్నేహితులు భావించినప్పటికీ కిరణ్ ఇల్లు జనం ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉండటంతో వీలు కాలేదు.
ఆ డబ్బును ముగ్గురూ పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెల్లిపోయారు. ఈ ఘటన గురించి కిరణ్ తన భార్యకు కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు. ఫోన్ స్విఛాఫ్ చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత లాక్ చేసిన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఇంటి యజమాని పోలీసులకు విషయం చెప్పడంతో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. సునీత కుటుంబ సభ్యులు ఆమె కనిపించకుండా పోయిందని పోలీస్ స్టేషన్ లో అప్పటికే మిస్సింగ్ కంప్టైంట్ ఇవ్వడంతో ఆ మృతదేహం సునీతదేనని పోలీసులు నిర్థారించారు.