సంవత్సరానికి రూ.40లక్షల జీతం సరిపోతుందా? ట్విట్టర్ రియాక్షన్ ఇదే..!

By telugu news teamFirst Published Jun 8, 2023, 9:42 AM IST
Highlights

భారత్ లో జీవించాలంటే సంవత్సరానికి 40 లక్షల జీతం సరిపోతుందా అని ఆమె అడిగింది. ఒక 23ఏళ్ల కుర్రాడు సంవత్సరానికి ప్యాకేజ్ 40లక్షలు అని, అవి సరిపోతాయా అని ఆమె అడగడం విశేషం.

జీవితంలో బతకడానికి డబ్బులు చాలా అవసరం. చేతిలో రూపాయి చిల్లి గవ్వ లేకుండా ఎవరైనా బతకగలరా? ఈ రోజుల్లో  నెలకు రూ.లక్ష జీతం వచ్చినా కనీస ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ప్రముఖ MNC కంపెనీల్లో పనిచేసినా చాలీ చాలని జీతమే అవుతోంది. పేరుకే లక్ష జీతం. కటింగ్స్ పోని చేతికి వచ్చేది మిగేలిది ఏమీ ఉండటం లేదు. ఈ క్రమంలో నే ఓ మహిళ తనకు వచ్చిన అనుమానాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

దీపాలి శర్మ అనే మహిళ ట్విట్టర్ లో అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆమె ఏం అడిగిందంటే, భారత్ లో జీవించాలంటే సంవత్సరానికి 40 లక్షల జీతం సరిపోతుందా అని ఆమె అడిగింది. ఒక 23ఏళ్ల కుర్రాడు సంవత్సరానికి ప్యాకేజ్ 40లక్షలు అని, అవి సరిపోతాయా అని ఆమె అడగడం విశేషం.

ఈ ప్రశ్న ట్విట్టర్ లో హాట్ టాపిక గా మారింది. ఆమె పోస్టుకి దాదాపు 1.1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇక కామెంట్స్ లో డిబేట్స్ జరగడం గమనార్హం. ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో అయితే, ఈ జీతం అస్సలు సరిపోదు అని వారు కామెంట్స్ చేయడం గమనార్హం. కనీసం 70లక్షలు అయినా వస్తే తప్ప,  జీవించలేరు అని ఎక్కువ మంది కామెంట్స్ చేయడం గమనార్హం. కొందరు అయితే, ఆ మాత్రం జీతం కూడా లేకుండా బతికేస్తున్నామని పేర్కొనడం గమనార్హం.
 

click me!