Pet Dog: అమానుషం..పెంపుడు కుక్కపై  యాసిడ్ దాడి.. అసలేం జరిగింది? 

Published : Aug 18, 2023, 05:45 PM IST
Pet Dog: అమానుషం..పెంపుడు కుక్కపై  యాసిడ్ దాడి.. అసలేం జరిగింది? 

సారాంశం

Pet Dog:మహారాష్ట్ర రాజధాని ముంబైలో అమానుష ఘటన జరిగింది. ఓ పెంపుడు కుక్కపై ఓ మహిళ అత్యంత దారుణంగా వ్యవహరించింది. తనకు చూసి కుక్క మోరిగిందని ఏకంగా యాసిడ్ దాడి చేసింది.   

Pet Dog:పెంపుడు జంతువులంటే చాలా మంది ఇష్టపడుతారు. వాటిని చిన్నపిల్లల్లా రెప్పలా చూసుకుంటారు. అదే సమయంలో అవి ఇతరులను  చూస్తే..అరుస్తూ.. కరువడానికి వస్తున్నాయని ఇరుగు పొరుగు వారు కంప్లైంట్ చేస్తుంటారు. ఈ తరుణంలో యాజమానితో గొడవపడటమో లేదా..చేరో మాట అనుకోవడంతో ఆ వివాదం సమసిపోతుంది. కానీ.. ఓ మహిళ మాత్రం దారుణంగా ప్రవర్తించింది. తనపై కుక్క దాడి చేయడానికి ప్రయత్నించిందని అమానుష్యంగా వ్యవహరించింది. అంతుపట్టలేని కోపంతో తన పొరుగింటి వారికి చెందిన కుక్కపై ఏకంగా యాసిడ్ పోసింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో శబిస్తా సుహైల్ అన్సారీ (35) అనే నివసిస్తుంది. ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌లో ఉండే వేరే కుటుంబం పెంచుకునే బ్రౌనీ అనే కుక్క ఆమెను చూసి అరిచిందని.. ఏకంగా యాసిడ్ తో దాడి చేసింది. ఈ దాడిలో కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ కుక్కను స్థానికంగా ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఆ కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు శబిస్తా సుహైల్ అన్సారీని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. అయితే.. ఆ మహిళ కుక్కపై యాసిడ్ పోయడానికి గల కారణాలను పోలీసులకు వివరించింది. తాను పెంచుకుంటున్న పిల్లిపై కుక్క దాడి చేసిందని, ఈ క్రమంలో   పలుమార్లు ఆ కుక్క యజమానికి ఫిర్యాదు చేసింది. కానీ, వారు పట్టించుకోలేదని, ఈ క్రమంలో కుక్కపై దాడి చేసినట్టు తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు