ముగ్గురు మహిళలతో నైట్ క్లబ్ ఓనర్ బర్త్ డే పార్టీ.. ఇద్దరు మరణం.. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమం

By Mahesh KFirst Published Dec 20, 2022, 12:39 PM IST
Highlights

నైట్ క్లబ్ ఓనర్ తన బర్త్ డే పార్టీని ముగ్గురు మహిళలతో సెలెబ్రేట్ చేసుకున్నారు. తన క్లబ్‌ నైట్ రైడర్‌లో సెలెబ్రేట్ చేసుకుని ఆ నలుగురు వేరే గదిలోకి వెళ్లారు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. ఆ తర్వాత రాత్రంతా గడిపారు. ఉదయం స్టాఫ్ అక్కడికి చేరగా.. క్లబ్ ఓనర్, మరో మహిళ మరణించారు. మరో ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలో కనిపించారు.
 

గురుగ్రామ్: బర్త్ డే పార్టీ ఫుల్ ఎంజాయ్ చేయాలని ఆ నైట్ క్లబ్ ఓనర్ అనుకున్నాడు. సెలెబ్రేషన్స్ అన్నీ అనుకున్నట్టే జరిగాయి. కానీ, సండే రోజు రాత్రి అనుకోని విధంగా పరిస్థితులు మారినట్టు తెలుస్తున్నది. ముగ్గురు మహిళలతో సెలబ్రేట్ చేయాలని నైట్ క్లబ్ ఓనర్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి నైట్ క్లబ్‌కు నలుగురూ చేరుకున్నారు. కానీ, సోమవారం ఉదయం అవాంఛనీయ దృశ్యాలు కనిపించాయి. నైట్ క్లబ్ ఓనర్‌, మరో మహిళ మరణించారు. కాగా, వేరే ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

ఈ ఘటన ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్ 3లో నైట్ రైడర్ క్లబ్‌లో జరిగింది. పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతామని వివరించారు. హత్యకు గురయ్యారా? లేక యాక్సిడెంటల్‌గా మరణించారా? లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అని దర్యాప్తు చేస్తామని తెలిపారు.

నైట్ రైడర్ క్లబ్ ఓనర్ సంజీవ్ జోషి, మరో ముగ్గురు మహిళలు సండే నైట్ బర్త్ డే పార్టీ సెలెబ్రేట్ చేయాలనుకున్నారు. రాత్రి నైట్ రైడర్ క్లబ్‌కు చెందిన ఓ రూమ్‌లో గడిపారు. ఆ రూమ్‌లో వేడిమి కోసం కాచే నిప్పు ఉన్నది. అయితే, వెంటిలేషన్ తక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.

Also Read: ఆడవాళ్లు కూడా ఇంత అందంగా చీర కట్టరేమో..!

రాత్రి సెలెబ్రేషన్స్ ముగిసిన తర్వాత ఆ నలుగురు పైన చెప్పిన గదిలోకి వెళ్లారు. ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత రాత్రంగా అక్కడే స్పెండ్ చేశారు. సోమవారం ఉదయం క్లబ్ సిబ్బంది ఆ గదిలోకి వెళ్లారు. నైట్ రైడర్ క్లబ్ ఓనర్ జోషి, మరో మహిళ మరణించి కనిపించారు. కాగా, మరో ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని హాస్పిటల్‌కు తరలించారు.

నిప్పు వేడిమితో ఉన్న ఆ గదిలో ఊపిరి సరిగ్గా అందక వారు మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దర్యాప్తు తర్వాతే అసలైన కారణాలు తెలియవస్తాయని పోలీసు అధికారి వికాస్ కౌశిక్ తెలిపారు.

click me!