నాకు ఆ హోదా వద్దు.. ఉత్తర్వులను వెనక్కుతీసుకోండి, సీఎం బొమ్మైకి లేఖ రాసిన యడియూరప్ప

By Siva KodatiFirst Published Aug 8, 2021, 8:19 PM IST
Highlights

తనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సదుపాయాలు, భద్రత మాత్రమే తనకు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 

కాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్ప జులై 26న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తదుపరి సీఎంగా బసవరాజు బొమ్మైని సిఫారసు చేశారు. అధిష్ఠానం సూచనల మేరకు శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన బసవరాజు జులై 28న నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రికి యడియూరప్పకు కేబినెట్‌ ర్యాంకు కలిస్తూ శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

దీన్ని తిరస్కరించిన యడియూరప్ప.. కొత్త ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మరోవైపు నూతన ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కొలువులోని  కొత్త మంత్రులకు ఆశించిన శాఖలు దక్కక పోవడంతో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. కేటాయించిన మంత్రి పదవులపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు  . ఈ సమయంలోనే యడియూరప్ప  కూడా ముఖ్యమంత్రికి లేఖ రాయడం గమనార్హం.  

click me!