త్వరలో హైడ్రోజన్‌తో... రైళ్ళ పరుగులు: భారతీయ రైల్వే సరికొత్త ప్రయోగం

Siva Kodati |  
Published : Aug 08, 2021, 07:44 PM IST
త్వరలో హైడ్రోజన్‌తో... రైళ్ళ పరుగులు: భారతీయ రైల్వే సరికొత్త ప్రయోగం

సారాంశం

భారతీయ రైల్వే త్వరలో హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను మనదేశంలోనూ ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు జర్మనీ, పోలెండ్‌లలో మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. ఈ విధానంలో సౌరశక్తి ద్వారా నీటి విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది.

ఆధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటున్న భారతీయ రైల్వే తాజాగా అతికొద్ది దేశాల్లో అమలులో ఉన్న హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను త్వరలో మనదేశంలోనూ ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు జర్మనీ, పోలెండ్‌లలో మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. ఈ విధానంలో సౌరశక్తి ద్వారా నీటి విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది. కాలుష్య రహిత హరిత రవాణా విధానంగా దీన్ని చెప్పుకోవచ్చు.

హర్యానాలోని సోనిపట్‌ - జింద్‌ మార్గంలో 89 కిలోమీటర్ల మేర ఉత్తర రైల్వే నడిపే డెమో రైలుకు హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను వినియోగించనున్నట్లు రైల్వేశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 5లోపు బిడ్లను దాఖలు చేయాల్సిందిగా ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ముందు ఆగస్టు 17న ఈ విధానంపై ఓ సదస్సు కూడా ఏర్పాటు చేసింది. ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న రైళ్ల స్థానంలో ఈ విధానాన్ని ప్రవేశపెడతారు. దీనివల్ల ఒక్కో రైలుకు ఏటా రూ.2.3 కోట్ల విలువైన ఇంధనం ఆదా కావడమే కాకుండా.. కర్బన ఉద్గారాలు ఏటా 11.12 కిలో టన్నుల నుంచి 0.72 కిలో టన్నులకు తగ్గుతాయని ఇండియన్ రైల్వే వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Performs Yoga: ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో యోగా ఆసనాలు వేసిన మోదీ | Asianet News Telugu
Nirmala Sitharaman: యోగాలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ | Asianet News Telugu