గోపాలపూర్ : అండమాన్ వద్ద సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉందని, గురువారం ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ బుధవారం తెలిపారు. 22 ఉదయంలోగా వాయుగుండంగా మారనున్న పీడనం మరింత బలం పుంజుకుని 23న తుఫానుగా మారుతుంది అన్నారు. తూర్పు కేంద్ర బంగాళాఖాతం నుంచి ఈ విపత్తు పశ్చిమ కేంద్రం బంగాళాఖాతానికి చేరువవుతుందని, ఆ తర్వాత మళ్లీ దిశ మార్చుకుని తీరం వైపు వస్తుందని చెప్పారు.
తుఫాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదని, 22న పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్ర ఉపరితలంలో 22వ తేదీ నుంచి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. చేపల వేట నిషేధించినట్లు తెలిపారు. కాగా, అండమాన్ లో ఏర్పడిన ఆవర్తనం తుపాను కానుందని స్పష్టమైంది. అమావాస్య సమయంలో ఈ విపత్తు తీరానికి చేరువవుతోంది. దీంతో రాకాసి అలలు విరుచుకు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ అధ్యయన నిపుణులు అంటున్నారు.
రక్తాలు కారేలా భార్యపై దాడి, వీడియో వైరల్.. భర్త అరెస్ట్..
తుపాను బలం పుంజుకోవడానికి సముద్రం వాయు మండలంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ నిపుణుడు డాక్టర్ సందీప్ పట్నాయక్ బుధవారం తెలిపారు. గాలి తీవ్రత, వర్షపాతం ఎలా ఉంటుందనేది 22న స్పష్టమవుతుంది అన్నారు. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు తీవ్రంగా ఉంటాయని ఈ స్థితిలో నెలకొన్న విపత్తు వల్ల తీరంవైపు రాకాసి అలలు పడతాయి అని విరుచుకుపడతాయని చెప్పారు.
ప్రయాణ దిశ 22న తేలుతుంది..
ఐఎండీ మాజీ ఉన్నతాధికారి డాక్టర్ శరత్ చంద్ర సాహూ బుధవారం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆవర్తనం తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ విపత్తు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా లేదా ఉత్తర ఒడిశా పశ్చిమ్ బంగల తీరాలకు చేరువయ్యే సూచనలు ఉన్నాయన్నారు. తుఫాను ఏ దిశగా ప్రయాణిస్తుందో 22న తెలుస్తుంది అన్నారు.
26వరకు ప్రభావం.. తుఫాను ప్రభావంతో 23 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, 24, 25 తేదీల్లో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపత్తు 26వరకు ప్రభావం చూపే అవశారం ఉంటుందన్నారు.