దీపావళి రోజున నగరంలోని ఆ మూడు చోట్ల బాంబు పేలుళ్లు.. బెదిరింపు ఫోన్ కాల్ తో అలర్ట్ అయిన ముంబయి పోలీసులు

By Rajesh KarampooriFirst Published Oct 20, 2022, 6:17 AM IST
Highlights

ముంబయిలో బాంబు పేలుళ్లు ఫోన్ కాల్ కలకలం రేపింది. నగరంలోని మూడు ప్రధాన  ప్రదేశాల్లో దీపావళి రోజున బాంబు పేలుళ్లు జరుగుతాయని  ముంబయి పోలీసులకు  బెదిరింపు కాల్ వచ్చంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు చేశారు.ఫైనల్ గా అది ఫేక్ కాల్ అని తేల్చారు.  

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బాంబు పేలుళ్లు జరుగుతాయన్న ఫోన్ కాల్ కలకలం రేపింది. దీపావళి పర్వదిన నాడు  నగరంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన యంత్రాంగం పరుగులు పెట్టించింది. తనిఖీలు చేసి.. చివరకు అది ఫేక్  బెదిరింపు కాల్ అని తేల్చారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ముంబయి పోలీస్ కంట్రోల్​ రూంకు మంగళవారం రాత్రి 10.30కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీపావళి పండుగ రోజున అంధేరీలోని ఇన్ఫినిటీ మాల్, జుహూలోని పీవీఆర్ మాల్, విమానాశ్రయంలోని సహారా హోటల్‌ల్లో బాంబ్ బ్లాస్టులు చేశామని ఆగంతుకులు బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు ఈ ఫోన్​ కాల్ ను చాలా సీరియస్​ గా తీసుకున్నారు. ఆ ఆకతాయిలు చెప్పిన మూడు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే.. వారికి అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో అది  ఫేక్ కాల్ అని తేల్చారు. అయితే.. ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారో గుర్తించే.. పనిలో పడ్డారు పోలీసులు. 

ఈ బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ముంబై పోలీసు యంత్రాంగం చాలా అప్రమత్తమైంది. బాంబ్ బ్లాస్టులు చేస్తామన్న ఆ మూడు చోట్లా భారీగా జనం  తిరుగుతుంటారు. గతంలో కంటే దీపావళికి  ఈ ప్రాంతాల్లో రద్దీ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కాల్స్ రావడంతో ముంబై పోలీసులు చాలా అలర్ట్ అయ్యారు. ముంబై పోలీసులకు కాల్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. జుహు, అంబోలి, బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్‌ల నుండి బృందాలు, CISF, BDDS బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. 

A phone call about bomb blasts at 3 places in Mumbai was received. The security agencies are trying to identify the caller in order to take further action. Caller claimed that explosions will take place in Infinity Mall Andheri, PVR Mall Juhu & Sahara Hotel Airport: Mumbai police

— ANI (@ANI)
click me!