UP Election 2022: జాబ్ క్యాలెండ‌ర్‌ తెస్తాం.. ఇంటింటి ప్ర‌చారంలో ప్రియాంక‌ గాంధీ

Published : Jan 31, 2022, 05:02 PM IST
UP Election 2022: జాబ్ క్యాలెండ‌ర్‌ తెస్తాం.. ఇంటింటి ప్ర‌చారంలో ప్రియాంక‌ గాంధీ

సారాంశం

UP Assembly Election 2022: ఫిబ్ర‌వ‌రిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో నోయిడాలో ఎన్నిక‌ల ఇంటింటి ప్ర‌చారంలో  పాల్గొన్న కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ.. తాము అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌నీ, వివిధ ఉద్యోగాల కోసం ప్ర‌త్యేకంగా జాబ్ క్యాలెండ‌ర్ (job calendar) ను తీసుకువ‌స్తామ‌ని పేర్కొన్నారు.   

UP Assembly Election 2022: వ‌చ్చే నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు (Assembly election 2022) జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు వేడేక్కాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్ని  ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి.  వివిధ పార్టీల నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ (UP Assembly Election) రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (UP Assembly Election-2022) మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చూపించాల‌ని కాంగ్రెస్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో నోయిడాలో ఎన్నిక‌ల ఇంటింటి ప్ర‌చారంలో  పాల్గొన్న కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) .. తాము అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌నీ, వివిధ ఉద్యోగాల కోసం ప్ర‌త్యేకంగా జాబ్ క్యాలెండ‌ర్ (job calendar) ను తీసుకువ‌స్తామ‌ని పేర్కొన్నారు.  ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నోయిడాలోని వివిధ బృందాలతో ఆమె మాట్లాడారు. ఇంటింటి ప్ర‌చారం కొన‌సాగించారు. జాబ్ క్యాలెండ‌ర్ కు సంబంధించిన అన్ని వివ‌రాలు ముందుగానే వెల్ల‌డిస్తామ‌నీ, ఉద్యోగాలు ఎలా కల్పిస్తామో అన్నది  కూడా యువతకు చెబుతామని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పేర్కొన్నారు. 

ఎన్నిక‌ల (UP Assembly Election) ప్ర‌చారంలో భాగంగా ఇత‌ర పార్టీల‌పై విమ‌ర్శ‌లు సైతం గుప్పించారు. రాష్ట్రంలో అధికార బీజేపీని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ.. అధికారంలోకి రాగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప‌లు రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి.. కానీ ఏ విధంగా క‌ల్పిస్తార‌నేది స్ప‌ష్టం చేయ‌వంటూ ఎద్దేవా చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉద్యోగాల క‌ల్ప‌న పై ఖ‌చ్చిత‌మైన స్ప‌ష్ట‌త‌తో ఉంద‌నీ, ఉద్యోగాల క‌ల్ప‌న గురించి అంద‌రికీ వివ‌రిస్తామ‌ని  ఆమె (Priyanka Gandhi) తెలిపారు. కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (UP Assembly Election-2022) బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీలు అధికారం ద‌క్కించుకునే ప్ర‌ధాన పార్టీల‌ని ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తే అర్థ‌మ‌వుతుంది. అయితే, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల‌కు భిన్నంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతూ.. ఈ ఎన్నిక‌ల‌ను మ‌రింత ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసేలా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత‌లు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ  (Priyanka Gandhi) లు యూపీ ఎన్నిక‌ల్లో త‌మ‌దైన రీతిలో ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. అంత‌కు ముందు జ‌రిగిన ఎన్నిక‌ల కంటే ఈ సారి కాంగ్రెస్ యూపీలో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చూపించే అవ‌కాశముంద‌ని తెలుస్తోంది. 

కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు (Assembly Election-2022) జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. మణిపూర్‌ (Manipur)లో ఫిబ్రవరి 27 నుంచి రెండు దశల్లో, పంజాబ్ (Punjab), గోవా, ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీలలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఐదు మరియు ఆరవ దశలతో సమానంగా పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం