ములాయం సింగ్ యాదవ్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాదాభివందనం.. వీడియో ఇదే

Published : Jan 31, 2022, 04:35 PM ISTUpdated : Jan 31, 2022, 04:43 PM IST
ములాయం సింగ్ యాదవ్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాదాభివందనం.. వీడియో ఇదే

సారాంశం

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాదాభివందనం చేశారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎంపీలు పార్లమెంటుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు కాంప్లెక్స్‌లో ములాయం సింగ్ యాదవ్ లోపలకు ఎంటర్ అవుతుండగా, ఎదురుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిలబడి ఉన్నారు. ములాయం వస్తుండటాన్ని చూసి వెంటనే వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు.  

న్యూఢిల్లీ: ఈ రోజు పార్లమెంటు(Parliament) ప్రాంగణంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బీజేపీ(BJP)కి ప్రత్యర్థ పార్టీ సమాజ్‌వాదీని(Samajwadi Party) స్థాపించిన ములాయం సింగ్ యాదవ్‌(Mulayam Singh Yadav)కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాదాభివందనం చేశారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి ఎంపీ ములాయం సింగ్ యాదవ్ నడుస్తూ వెళ్లుతుండగా అక్కడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిలుచుని ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ వస్తుండటాన్ని చూసీ చూడగానే వెంటనే ఆయన వద్దకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెళ్లారు. ములాయం సింగ్ యాదవ్ జాగ్రత్తగా మెట్లు దిగుతూ ఉండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయన వద్దకు వెళ్లి.. ఆయన కాళ్లకు నమస్కరించారు. ఈ విషయాన్ని ములాయం సింగ్ యాదవ గుర్తించారు. ఆమెను ఆశీర్వాదాలు తెలిపారు. ములాయం సింగ్ యాదవ్‌కు స్మృతి ఇరానీ పాదాభివందనం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

పార్లమెంటులో ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగానే ఎంపీలు పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ రోజు బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఎకనామిక్ సర్వే రిపోర్టును ప్రవేశపెట్టారు.

ఈ ప్రసంగం సందర్భంగా రాష్ట్రపతి భారత స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకున్నారు. వారికి నివాళులు అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో భారతీయులు ఒక టీమ్‌గా పని చేశారని వివరించారు. భారత్‌లో టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచ రికార్డులను నెలకొల్పిందని చెప్పారు. 90 శాతం మంది వయోధికులు కనీసం ఒక్క డోసు అయినా తీసుకుని ఉన్నారని పేర్కొన్నారు. ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు.

ప్పట్లాగే బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా, రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంటుల ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) వృద్ధి రేటు 9.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ సర్వే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసిన వృద్ధి రేటు కంటే తక్కువగా ఉండటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను భారత దేశంలో వృద్ధి రేటు 9 శాతం ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం పార్లమెంటులో ఎకనామిక్ సర్వే 2021-22ను ప్రవేశపెట్టారు. రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం