'చికెన్‌తో కరోనా అని నిరూపిస్తే రూ. 5 కోట్ల బహుమతి'

By narsimha lode  |  First Published Mar 18, 2020, 11:56 AM IST

కోడిగుడ్డు, చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎవరైనా నిరూపిస్తే  ఐదు కోట్ల  బహుమతిని అందిస్తామని పూణెకు చెందిన చికెన్  వ్యాపార సంస్థ ప్రకటించింది.



న్యూఢిల్లీ: కోడిగుడ్డు, చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎవరైనా నిరూపిస్తే  ఐదు కోట్ల  బహుమతిని అందిస్తామని పూణెకు చెందిన చికెన్  వ్యాపార సంస్థ ప్రకటించింది.

 పూణెకు చెందిన అమీర్ చికెన్  సంస్థ ఎండీ విజయ్ మోరే ఈ విషయాన్ని ప్రకటించారు.   కోడి గుడ్డు, చికెన్‌ తినడం వలన కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ఎవరైనా 
నిరూపిస్తే రూ. 5 కోట్లు చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. 

Latest Videos

undefined

Also read:కరోనా ఎఫెక్ట్: 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో సురేష్ ప్రభు

చికెన్ తినడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని తీవ్ర ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  చికెన్ తో పాటు కోడిగుడ్ల అమ్మకాలు తీవ్రంగా పడిపోయాయి. చికెన్ తో పాటు కోడిగుడ్లతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని వినియోగదారుల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో  ఈ కార్యక్రమాన్ని తీసుకొన్నట్టుగా  విజయ్  మోరే ప్రకటించారు.


కరోనా కారణంగా కోడి మాంసం, కోడి గుడ్లు వ్యాపారం తీవ్రంగా నష్టపోయిందని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. గతంలో. రూ. 4.50 గా విక్రియించిన కోడి గుడ్డు ధర ఇప్పుడు రూ. 1.30, కోడి మాంసం రూ. 80 నుంచి రూ. 20కి తగ్గింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులు కూడ కారణమని చికెన్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

 కోళ్లను నాశనం చేసే ఆలోచన మాకు లేదు. వాటిని దానా పెట్టకపోతేనే అవి గుడ్లుపెట్టవు. ప్రజలు వదంతులను నమ్మకుండా కోడి మాంసం, గుడ్లు తినాలని కోరారు. కరోనా వదంతుల వల్లే ఇప్పటి వరకు పౌల్ట్రీకి రూ. 500 కోట్లు నష్టం వాటిల్లింది

click me!